జి.పి.లేఅవుట్ రిజిస్ట్రేషన్లు కల్పించాలి

 జి.పి.లేఅవుట్ రిజిస్ట్రేషన్లు కల్పించాలి


 తెలంగాణ రియల్టర్స్  అసోసియేషన్ డిమాండ్


విలేకరుల సమావేశంలో కాటేపల్లి జనార్దన్ రావు



ఖమ్మం  (సి కె న్యూస్) రియల్ ఎస్టేట్ రంగానికి చట్టబద్ధత కల్పించాలని, జిపి లేఅవుట్ లకు తక్షణమే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ రియల్టర్స్  అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కాటేపల్లి జనార్దన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  రియల్ ఎస్టేట్ రంగం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తుందని, అటువంటి రంగానికి ప్రభుత్వం కూడా అండగా ఉండాలని కోరారు. 

తమ లాంటి చిన్న వ్యాపారం చేసుకునే వారిపై కొనుగోలు దారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయని, రిజిస్ట్రేషన్లు చేయకపోవడం వల్ల భయానా చెల్లించిన వారి నుంచి సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వానికి ఆదాయం చూపించే వారికి అండగా ఉండాల్సింది పోయి జిపి లేఅవుట్ ల  రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయటం సరైంది కాదన్నారు.


తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణకు సహకరించిన వెంచర్ల యజమానులకు, బిల్డర్స్ అసోసియేషన్ వారికి నగర ప్రముఖులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ  విలేకరుల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరి రాము, నగర అధ్యక్షులు అన్వర్ పాషా, జిల్లా ప్రచార కార్యదర్శి మాతంగి అనిల్ కుమార్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బానోతు సత్యం, నగర ప్రధాన కార్యదర్శి పఠాన్ జానీ, కోశాధికారి కుమ్మరి కుంట్ల కైలాష్, కార్యదర్శి పాశం నరేష్, చందులాల్, జిల్లా కార్యదర్శి మంద ఉషారాణి, మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్ యాదవ్, సభ్యులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments