సిపిఐ ఎంఎల్ ప్రజా పందా పార్టీ ఆధ్వర్యంలో ఏఈకి వినతి పత్రం

 *సిపిఐ ఎంఎల్ ప్రజా పందా పార్టీ ఆధ్వర్యంలో అన్నారపాడు సబ్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించి జూలూరుపాడు ఏఈకి వినతి పత్రం 



... Ckన్యూస్ ప్రతినిధి జూలూరుపాడు..........................భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంసిపిఐ ఎంఎల్ ప్రజా పందా రాష్ట్ర కమిటీ పిలుపుల భాగంగా ఈరోజు జూలూరుపాడు మండలం అన్నారు గ్రామంలో సబ్స్టేషన్ ముందు గంట సేపు ధర్నా నిర్వహించి జూలూరుపాడు ఏఈ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోతు కృష్ణ పార్టీ డివిజన్ నాయకులు ధర్మ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి ఉచిత కరెంటు అనే నినాదాలు గంగలో కలిపి ఏసీడీ పేరుతోటి ప్రజలపై వెనలేని భారాలు మోపి ప్రజలను మోసం చేస్తున్నారని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోజురోజుకీ నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ సందముగా తిరిగి వేలాది రూపాయలు కరెంటు చార్జీలు పెంచి ప్రజలకు అర్థం కాకుండానే దారి దోపిడీ దొంగల్లాగా ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎలాగైతే కరెంటు ఉద్యమ షాక్ తగిలిందో ఈ ప్రభుత్వాలకు కూడా పతనం కావడానికి కరెంటు షాక్ ప్రజలు ఇస్తారని హెచ్చరించారు ఐక్య ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జవహర్లాల్ బానోతు హీరో గూగులో లింగ తోటకూరి నరేష్ కొమిని కిషోర్ భారతి కమిలి బీమా కిష్ట సక్రు మన రాజుల కృష్ణ జగదీష్ తదితరులు పాల్గొన్నారు

Comments