అక్రమ కేసులను ఎత్తివేయాలి
- విలేకరుల సమావేశంలో జేఏసీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజయ్ బాబు
ఖమ్మం ( సి కె న్యూస్ )
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేల్ పై పెనుబల్లి పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆల్ ఇండియా క్రిస్టియన్, ముస్లిం, దళిత, గిరిజన వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి అజయ్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దమ్మపేట మండలం సరోజినిపురం గ్రామానికి చెందిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు పై సత్తుపల్లి ఎమ్మెల్యే ప్రోద్బలంతో పెనుబల్లి పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నందుకు, పోడు చేసుకుంటున్న పోడు రైతులకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్న మద్దిశెట్టి సామేలు పై రాజకీయ కుట్రతో అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
నిరాధారమైన కేసులను నమోదు చేయటం పట్ల ఆర్.పి.ఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సత్తుపల్లిలో ఏసిపి ఆఫీసు ముందు ధర్నా చేయటం జరిగిందన్నారు.
తమ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక పోలీసుల చేత అక్రమ కేసులు బనాయించడం సరైంది కాదన్నారు.
సామేలు పై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, పెనుబల్లి సిఐ ఎస్ఐ లను సస్పెండ్ చేయాలని మద్దిశెట్టి అజయ్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సురేష్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment