రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ ను తెస్తాం..

*రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ ను తెస్తాం..*

భారత్ తన లక్ష్యాన్ని కోల్పోతోంది..

భారత్ లో తాగు సాగు నీటి కోసం ఒక్క ప్రాజెక్టు లేదు...

సహజ సంపద ఉపయోగించుకోలేక అప్పులు చెయ్యాలా...?

విపక్షాల ప్రభుత్వాన్ని తెస్తే దేశం మొత్తానికి తాగు,  సాగు నీరు అందిస్తాం..



-  బి ఆర్ ఎస్ జాతీయ సభ లో కేసి ఆర్ 

విపక్షాల ప్రభుత్వాన్ని తెస్తే భారత్ రూపురేఖలు మారుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 
భారత్ తన లక్ష్యాన్ని కోల్పోతుందని  ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ఒక్క తాగు,సాగు నీటి ప్రాజెక్ట్ కూడా లేదన్నారు. 
భారత్ లోని సహజ వనరుల్ని ఉపయోగించుకోకుండా ఇతర దేశాల వద్ద ప్రపంచ బ్యాంక్ వద్ద బిక్షం ఎత్తుకునే పరిస్థితి ఎందుకన్నారు. బి ఆర్ ఎస్ కి అధికారమిస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల  భారత్ ను తయారు చేస్తా అన్నారు. బుధవారం 
ఖమ్మం లో బి ఆర్ ఎస్ జాతీయ సభ ఘనంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులు హాజరైన బి ఆర్ ఎస్ ఆవిర్భావ సభలో వక్తల ప్రసంగాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి.  ఈసందర్భంగా  
ఖమ్మం సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ

బీఆర్ఎస్ వస్తే దేశ వ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. 
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం అమ్మేసినా బీఆర్‌ఎస్ పవర్‌లోకి వస్తే మళ్లీ జాతీయం చేస్తుందన్నారు.
75ఏళ్ల స్వాతంత్ర్య భారత్‌లో విషపు మంచినీళ్లే తాగుతున్నామని 
తమకు అధికారం వస్తే దేశమంతా మిషన్ భగీరథ తరహా నీటిని అందిస్తామన్నారు. 

 దేశం లక్ష్యం కోల్పోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. నీళ్ల విషయంలో ట్రెబ్యునళ్ల ఏర్పాట్లపైనా కేసీఆర్ ఘాటుగా స్పందిచారు. ఉలుకూపలుకులేని ట్రెబ్యునళ్లతో ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు అని ప్రశ్నించారు. సాగుకు ఆమోదయోగ్యమైన భూమి ఉంది. నీరుంది. వనరులు పుష్కలంగా ఉన్నాయి. కానీ వాడుకునే తెలివి కేంద్రంలోని ప్రభుత్వాలకు లేకపోయిందని విమర్శించారు.
ప్రస్తుతం దేశమంతటా కరెంట్ కష్టాలు ఉన్నాయన్నాయని ఒక్క తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లోనూ కోతలేనని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. 2 ఏళ్లలోనే వెలుగు జిలుగుల భారతాన్ని ఆవిష్కరిస్తామన్నారు.  రైతులకు  ఉచిత కరెంట్ ఇస్తామని స్పష్టం చేశారు.  దేశవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. కేంద్రం ఏటా 25 లక్షల మందికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్లకు చేతకాకపోతే.. తమ ప్రభుత్వం వచ్చాక చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.

బీజేపీది ప్రైవేటైజేషన్ విధానమైతే.. బీఆర్‌ఎస్‌ది నేషనలైజేషన్ విధానమన్నారు. ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటిని తిరిగి మళ్లీ జాతీయకరణ చేస్తామన్నారు.

*దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం - సీఎం కేసీఆర్‌*

దేశ దుస్థితికి కాంగ్రెస్‌, బీజేపీనే కారణం అని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే బీజేపీని తిడుతుందన్నారు. బిజేపి అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం ఉంది. ఎప్పుడూ 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌కు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారని విమర్శించారు.

*ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు..*

ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.

*ప్రపంచానికి ఫుడ్‌చైన్ అందించాం..* 

మనం మాత్రం మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం..
దేశంలో అపార జల సంపద ఉంది.. భూమి ఉంది.. నీరు ఉంది. యాపిల్‌తోపాటు మామిడి కూడా పండుతుంది. మన దేశం ప్రపంచానికి ఫుడ్‌చైన్‌గా ఉండాలి. కానీ మనం మెక్‌డొనాల్డ్ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటున్నాం. ఫామ్‌అయిల్‌ను కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 





*ఖమ్మం జిల్లాకు కేసీఆర్ వరాలు..*

 ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు. ఖమ్మం జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలకు రూ.10 కోట్లు.. ఇతర మున్సిపాల్టీలకు 
రూ.30 కోట్లు కేటాయిస్తున్నాం అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కి రూ.50 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Comments