పొంగిలేటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదుఅంటున్న బి.ఎస్.పి

పొంగిలేటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదుఅంటున్న బి.ఎస్.పి*

.. పార్టీ మండల అధ్యక్షుడు  నరసింహారావు.................................

ck న్యూస్ ప్రతినిధి జూలూరుపాడు...........................................

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు

 బీఎస్పీ పార్టీ వైరా నియోజకవర్గ అధ్యక్షులు *బానోత్ రాంబాబు నాయక్* ఆదేశానుసారం



జూలూరుపాడు బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు *తంబర్ల నరసింహారావు* మాట్లాడు

అధికార బి ఆర్ ఎస్ పార్టీ కాదు అన్నారని పేద ప్రజలపై ప్రేమ చూపిస్తున్న పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్నాళ్లు అధికార పార్టీలో ఉండి ప్రజా సమస్యలపై ఎందుకు  ప్రశ్నించలేకపోయారు


మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడే ప్రతి ఇంటికి నల్ల రాలే ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలే ప్రతి పేద దళితులకు  మూడు ఎకరాల భూమి రాలే కేజీ టు పీజీ విద్య అమలు చెయ్యమనలేదు


చెప్పుకు డప్పుకు ₹2000 పింఛన్ రాలే దళిత బంధు కొంతలోనే ఆగిపోయింది గిరిజన బందు అనేది ఇంకా అమల్లోకి నోచుకోలే నిరుద్యోగ సమస్యలు తీరలేదు బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల తెలంగాణగా చేసినప్పుడు ప్రశ్నించని మీరు ఈరోజు దూరం పెట్టారని అధికార పార్టీపై నిప్పులు చెరుకుతూ ఉన్నారు.  మరి ఇన్ని రోజులు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు 


మిమ్మలను దగ్గరకు చేర తీస్తే పేద ప్రజల సమస్యలు గుర్తుకు రావా మిమల్ని దూరం పెడితే పేద ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయా మీరు అందలం ఎక్కాలన్న బి ఆర్ ఎస్ పార్టీ అందలం ఎక్కాలన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రజల ఓట్లు సపోర్టు కావాలి


గనుక ఇప్పుడు ఎన్నికలు సమయం దగ్గర పడుతూ ఉంటే బి ఆర్ ఎస్ అధికార పార్టీ మిమ్మలను దూరం ఉంచిందని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు ఇన్నాళ్లు ఎందుకు అధికార పార్టీని ప్రశ్నించలేకపోయారు?  ఇప్పుడు పేద ప్రజల వద్దకు వస్తారు ఎన్నికలు హామీలు ఇస్తారు ఎన్నికలు అయిపోయినంక వారి ఓట్లతో అధికారంలోకి వచ్చి వారికి ఇచ్చిన హామీలను మర్చిపోయి పేద ప్రజలను నానా ఇబ్బందులుకు గురిచేస్తారు


గనక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీ ప్రజలు  అగ్రవర్ణ కులాల్లో ఉన్న  కొందరు పెద్దలు మనకు చేసే మోసాల గురించి తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో మన సామాజిక వర్గానికి చెందినటువంటి బీఎస్పీ పార్టీ ఏనుగు గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన పాలన మనమే చేసుకోవాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బి ఎస్ పి పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు దేవరకొండ నిర్మల. ఉపాధ్యక్షురాలు కొంగల లలిత. తదితరులు పాల్గొన్నారు

Comments