' *పద్మశ్రీ' శాంతిసిన్హ తో మంద కృష్ణ మాదిగ భేటి*.
*మారేడుపల్లి - హైదరాబాద్*
సామాజిక సేవకురాలు, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్‌కు చైర్ పర్సన్ , పద్మశ్రీ అవార్డు గ్రహీత , ఎంవీ ఫౌండేషన్ స్థాపకురాలు. ప్రొఫెసర్ శాంతాసిన్హా గారితో అనాథ హక్కుల పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారు భేటి అయ్యారు.
ప్రస్తుతం అనాథ పిల్లల సంక్షేమం కోసం జరుగుతున్న ఉద్యమం, పరిస్థితులు, ప్రభుత్వ హామీలు మొదలగు వాటి గురించి చర్చ జరిగింది.
శాంతిసిన్హా గారు బాలకార్మిక వ్యవస్థ నిర్ములన కోసం ఎంతో కృషి చేసారు. బాలల హక్కుల కోసం, వారికి విద్యను అందించడం కోసం ఎంతో శ్రమించారు.
ఈ సందర్భంగా అనాథ పిల్లల హక్కుల కోసం జరిగే పోరాటానికి సంఘీభావం తెలపాలని, ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అనాథ హక్కుల పోరాట సమితి చీఫ్ అడ్వైజర్ వెంకట్ రెడ్డి గారు, అధ్యక్షులు వెంకటయ్య గారు, సామాజిక కార్యకర్త డా.సంపంగి శంకర్ గారు పాల్గొన్నారు.
Comments
Post a Comment