భద్రాద్రి రాములవారిని దర్శించుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మదన గోపాల్

 భద్రాద్రి రాములవారిని దర్శించుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మదన గోపాల్ 



CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి


 19 జనవరి 23.


     నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీ నుండి మదన గోపాల్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. 

     గురువారం నాడు స్వామివారి దర్శనానికి వచ్చిన ఆయనకు దేవాలయం పర్యవేక్షకుడు కత్తి శ్రీనివాస్ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా అర్చక స్వాములు బలపీఠం వద్ద పూజలు చేసిన అనంతరం స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారిని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు నేషనల్ హ్యూమన్ రైడ్ కమిషన్ మదన్ గోపాల్ కి స్వామివారి పట్టు వస్త్రాలు తీర్థ ప్రసాదాలు అందించి స్వామి వారి విశిష్టత తెలిపి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఐటీడీఏలోని హౌసింగ్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ మరియు ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జిల్లా మరియు ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయనకు తెలియజేశారు. 

    క్రమంలో చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఫారెస్ట్ బీమా నాయక్ డీఎఫ్ఓ రంజిత్ నాయక్ ఏ టి డి ఓ నర్సింగరావు మరియు ఆర్ఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Comments