39వ డివిజన్ అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ

 *39వ డివిజన్ అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ*


 సీకే న్యూస్ ప్రతినిధి ఖమ్మం :

ఫిబ్రవరి 19:



 ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్థానిక 39వ డివిజన్ లో తపాలా మసీద్ వెనుక భాగం లో దూది పీరి కొట్టం దగ్గర  డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో దోమలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు.

మీరు  ఎంతగానో  మెచ్చుకుంటున్న జవాన్  పాషా  మెయిన్ మెయిన్ సెంటర్ లో శుభ్రం చేయిస్తూ  అధికారులు కు  మెచ్చు కొనే విధంగా డ్రైనేజీ పనులు శుభ్రం చేస్తున్నారు.కానీ కొన్ని గల్లీలో మాత్రం  శుభ్రం అనేది ఉండదు. వర్కర్స్  కూడా  నటనలో చాలా అద్భుతంగా చేస్తారు.

అందరూ తిరిగే మెయిన్ రోడ్లు మీద మంచిగా నీటుగా  ఊడవడం డ్రైనేజీ శుభ్రం చేయడం చేస్తున్నారు.గల్లీలో  ఎవరు తిరగరు కాబట్టి ఎవరు చూడరు అనుకొని 39వ డివిజన్ కొన్ని  గల్లి లో మాత్రం శుభ్రం అనేది ఉండదు.39వ డివిజన్ లో పనిచేస్తున్న లక్ష్మి అనే కార్మికురాలు మహానటి. ఈమె మెయిన్ రోడ్లు మీద మంచిగా ఉడుస్తుంది.  

కానీ గల్లీలో మాత్రం రోడ్లమీద చెత్తాచెదారం ఉన్నా కూడా పైన పైన ఉడుస్తూ ఉంటుంది. వేరే డివిజన్ నుంచి వచ్చిన వర్కర్స్ కూడా అంతే మెయిన్ రోడ్లు మీద ఉన్న  డ్రైనేజీ పనులు మంచిగా చేస్తూ ఉంటారు. కానీ గల్లీలో మాత్రం పైన పైన కనబడుతున్న చెత్తాచెదారం  తీస్తూ  ఉంటారు.జవాన్ పాషా కూడా చూసి చున్నట్టుగా  ఉంటున్నారు.

ఇదే విషయాన్ని డివిజన్ ప్రజలు పలుమార్లు జవాన్ కు విన్నవించుకున్న ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కావున ఇకనైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Comments