రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్ల కు బడ్జెట్ను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు, 2023-2024 సంవత్సరంనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు 50 వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రమును జిల్ల బీసీ సంక్షేమ సంఘం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సిహ్మా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో 1200 మంది బలిదానంలో 1000 మంది పైన బీసీ లే ఉన్నారని, తెలంగాణ ఏర్పడిన నాటి నుండి కూడా బీసీలను చిన్నచూపు చూస్తూ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో చాలా తక్కువ నిధులు కేటాయిస్తూ టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలను మోసము, దగ చేస్తూ బీసీలను ఉక్కు పాదంతో అంచివేస్తున్నాడు కేటాంచిన తక్కువ బడ్జెట్ లో కూడా 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయ లేదు. స్థానిక సంస్థలలో కూడా 35 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్లు 18 శాతానికి తెచ్చినాడని ఆవేదన వ్యక్తం చేస్తూ అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా 2,90,396 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం రెండు శాతం 6229 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం చాలా దుర్మార్గమని, బీసీలు అభివృద్ధి చెందకుండా అనగదొక్కడమేనని, బీసీలు అభివృద్ధి చెందుతే రాజకీయంగా అగ్రవర్ణాల వారికి ఏడ పోటీకి వస్తారో అని కుట్రపూరితంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు,బీసీ కార్పొరేషల్లకు నిధులు లేవు, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, రాష్ట్ర ఆదాయంలో బీసీలు చెల్లించిన పన్నులు లేవా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీలపై కేసీర్ కు చిత్తశుద్ధి ఉంటే 6000 కోట్ల నుండి 50 వేల కోట్ల వరకు బడ్జెట్ను పెంచాలని, బీసీ బందును ప్రకటించాలని, 90 శాతం సబ్సిడీతో నిరుద్యోగ బిసి యువతకు లోన్లు ఇవ్వాలని, బీహార్ రాష్ట్రంలో లాగా బీసీ గణనను తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయాలని, చట్టసభలలో బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల రాబోయే సాధారణ ఎన్నికల్లో బీసీలను ఐక్యం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు ,నియోజకవర్గ అధ్యక్షులు మట్ట రమేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కందాల భాస్కర్, జిల్లా కార్యదర్శి దాసరి వెంకన్న యాదవ్, అక్కెనపల్లి శ్రీనివాస్, రాచూరి హరీష్, తండు కృష్ణ, జానకి రాములు, కత్రోజు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment