వచ్చే ఎన్నికల్లో జిల్లాల్లో ఐదు స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం ....
జిల్లాలో తమాషా రాజకీయాలకు దూరంగా ఉండాలని పిలుపు....
మేకపోతు గంభీర్యానికి ఎవరు భయపడరు...
అర్హులైన ప్రతి కుటుంబానికి దళిత బందు....
CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఫిబ్రవరి 01,
రానున్న ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం లో బిఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ రెగా కాంతారావు అన్నారు...
స్థానిక హరిత హోటల్లో పట్టణ అధ్యక్షులు అరికెళ్ళ తిరుపతిరావు అధ్యక్షతన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......
కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ...... స్థానిక అసెంబ్లీ అభ్యర్థి ఎన్నికపై కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,అధిష్టానం ఎవరి పేరు నిర్ణయించిన వారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు....
నియోజకవర్గంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు , బిఆర్ఎస్ పార్టీకి పోటీని ఇచ్చే స్థాయిలో లేవని ఆయన అన్నారు..... జిల్లాలో జరుగుతున్నటువంటి తమాషా రాజకీయాలకు దూరంగా ఉండాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.....
అదేవిధంగా భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ*...... తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతుబంధు వంటి పథకాలు బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా అంటూ ప్రశ్నించారు....
ధన బలంతో ఎమ్మెల్యేలను కొనాలనే బిజెపి పార్టీ ప్రయత్నం విఫలమై పార్టీ పరువు పోయే పరిస్థితి నెలకొందన్నారు......
ఎమ్మెల్యే పోదాం వీరయ్య ను ఉద్దేశించి మాట్లాడుతూ ...... టూరిస్టుల వచ్చే నాయకులను నమ్మవద్దని స్థానిక ప్రజా సమస్యలు పై దృష్టి సారించే నాయకులను ఎంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళిత బంధు పథకం వారికి బంగారు బాతు గుడ్డు అయిందని ఆయన విమర్శించారు...
దళిత బంధు పథకం పై మాట్లాడుతూ..... దళిత బంధు
పథకం పై స్థానిక ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు.... దళిత బంధు పథకం ఏడు సంవత్సరాల ప్రక్రియ అని, ఈ ఏడు సంవత్సరాల్లో అర్హులైన ప్రతి ఒక్క దళిత కుటుంబానికి పథకం అందజేస్తామని ఆయన అన్నారు.....
పొంగులేటిని ఉద్దేశించి మాట్లాడుతూ....
కొందరు పార్టీని విడే దమ్ము లేక పార్టీలోనే ఉంటూ పార్టీని విమర్శిస్తున్నారని అన్నారు. మేకపోతు గంభీర్యానికి ఎవరు భయపడాలని అన్నారు..... ధన బలంతో కొందరు నిర్వహించే సమావేశాలకు ఒక్కొక్కరికి 200 నుంచి 2000 వరకు ఇచ్చి జనాలను జన సమీకరణ చేస్తున్నారని, కానీ
బిఆర్ఎస్ పార్టీ సమావేశాలకు కార్యకర్తలు అభిమానంతో తరలి వస్తారని అన్నారు.. ధన బలం ఉందని ఎవరికి తాము భయపడమని అన్నారు.... అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి గొప్ప నాయకత్వం ఉందని కార్యకర్తలకు గుర్తు చేశారు.....
ఈ కార్యక్రమంలో చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బోధబోయిన బుచ్చయ్య, పార్టీ సీనియర్ నాయకులు మానే రామకృష్ణ, దుమ్ముగూడెం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నెం సత్యాలు, భద్రాచలం బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అరికెళ్ల తిరుపతిరావు, కొండశెట్టి కృష్ణమూర్తి, పార్టీ ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చింతడి చిట్టిబాబు, పార్టీ అధికార ప్రతినిధి బల్ల రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు ప్రమోద్ కుమార్, పార్టీ జాయింట్ సెక్రెటరీ బొంబోతుల రాజీవ్, పార్టీ యువజన అధ్యక్ష, కార్యదర్శులు గాడి విజయ్, ఆకుల వెంకట్, తదితరులు పాల్గొన్నారు.....
Comments
Post a Comment