గోదావరిలో భారీ యంత్రాలతో అక్రమ ఇసుక రవాణా.
CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఫిబ్రవరి 01,
భద్రాచలం డివిజన్ ఏజెన్సీ ప్రాంతం లో గిరిజనుల అభివృద్ధి చెందాలని భద్రాచలం ఐటిడిఎ ద్వారా గిరిజన సొసైటీలను ఏర్పాటు చేసి పిసా గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన తర్వాత సొసైటీలకు భూగర్భగనుల శాఖ అధికారులు నిర్దేశించిన సరిహద్దులలో ఇసుకను తీసెందుకు అనుమతిస్తారు. టి ఎస్ ఎం డి సి అధికారులు ఆమోదం పొందిన తర్వాత గోదావరి నుండి ఇసుకను తీసేందుకు గ్రామంలోని ప్రజలకు, ట్రాక్టర్లకు యజమానులకు ఉపాధి కల్పించడం, ఎన్నో కుటుంబాలు అభివృద్ధి చెందడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశము. కానీ భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం ఆర్. కొత్తగూడెం ఇసుక ర్యాంపు లో జరిగేది వేరు గిరిజన సొసైటీలకు గోదావరి నుండి ఇసుకను తీసి అమ్ముకొనే ఆర్థిక స్తోమత లేకపోవడం వలన రేసింగ్ గుత్తే దారులను ఆశ్రయిస్తారు. బినామీ గుత్తేదారులు పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు రాబట్టుకొని దానితో పాటు అధిక లాభాలు పొందేందుకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తోలకాలకు శ్రీకారం చుట్టారు. సుమారు ఐదు ఆరు టిప్పర్లతో గత పది రోజుల నుండి ఇదే వరుస కొనసాగుతుందని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు.
ఇసుక ర్యాంపులో టి ఎస్ ఎం డి సి అధికారులు కంటైనర్ కార్యాలయం, ఆన్లైన్ ప్రక్రియ ఏర్పాటు చేసి గోదావరి నుండి డంపింగ్ యార్డ్ వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత సొసైటీలకు గోదావరి నుండి ఇసుక తోలకాలు జరిపేందుకు అనుమతులు ఇవ్వాల్సి ఉండగా అందుకు విరుద్ధముగా ఇసుకలు తీస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎటువంటి అనుమతులు సీసీ కెమె రాలు టీ ఎస్ డీ ఎం సీ కంటైనర్ కార్యా లయం, ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించ కుండానే ఇసుకను డంపింగ్ చేస్తున్నారని తేటతెల్లమవుతుంది. కానీ ఇక్కడ బినామీ వ్యాపారులు మాత్రం రాత్రి సమయంలో గోదావరి నడిబొడ్డులో భారీ యంత్రాలు పెట్టి టిప్పర్ల ద్వారా సీతమ్మ సాగర్ కాల్వ గట్టు పై నుండి వందలాది టిప్పర్ల ద్వారా ఇసుకను తోలకాలు జరుపుతూ గ్రామ ప్రజలకు ట్రాక్టర్ల యజమానులకు ఉపాధి లేకుండా చేస్తున్నా రని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి సమయంలో ఇసుకతోలకాల జరుపుతూ న్నా విషయము టీ ఎస్ డీ ఎం సీ అధికారు లకు తెలుసా ? తెలియదా? తెలిసే తెలియ నట్టు ఉంటున్నారా అనే అనుమానాలు సర్వస్త్ర వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అర్ధరాత్రి సమ యంలో గోదావరి నుండి భారీ యంత్రాలు టిప్పర్లతో ఇసుక తోలకాలను నియంత్రించి పంచాయతీ పరిధిలోని గ్రామస్తులకు, ట్రాక్టర్ల యజమానులకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు.
Comments
Post a Comment