కల్లూరు మండలంలో పర్యటించిన బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత , ఎంపీ నామ నాగేశ్వరరావు.
▪️ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ నామ.
▪️ పలు కుటుంబాలను పరామర్శించిన ఎంపీ నామ నాగేశ్వరరావు
సత్తుపల్లి నియోజకవర్గం, కల్లూరు మండలంలో ఆదివారం నాడు బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు అందులో భాగంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తో కలసి మండలం లోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు
ముందుగా మండల కేంద్రంలో ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయా విశ్వ విద్యాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం తో పాటుగా అక్కడే ఉన్న యోగ కేంద్రం జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు అలానే చారుగుండ్ల వారి ఫంక్షన్ హాల్ గుర్రం శ్రీనివాసరావు మనవరాలు బారశాల కు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు
అనంతరం మండలంలోని కప్పలబంధం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి మృతి చెందిన గుర్రాల లక్ష్మారెడ్డి, లక్కిరెడ్డి రామిరెడ్డి గార్ల ఇళ్లకు వెళ్ళి వారి కుటుంబాలను అలానే గూడూరు రంగారెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ నుండి చండ్రుపట్ల గ్రామానికి చేరుకొని గ్రామంలో ఇటీవల మరణించిన ఫైళ్ళ తిరుమలరావు,కోమటి పుల్లయ్య, నెరేళ్ల లక్ష్మణరావు, కాటంనేని నాగయ్య, పాస్టర్ రాయల శ్రీనివాసరావు, కాటంనేని సత్యనారాయణ, వల్లభనేని శ్రీనివాసరావు, గుంజా వీరభద్రం ల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమాల్లో DCMS చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, మండల రైతు బంధు సమితి కన్వీనర్ లక్కినేని రఘు, మండల రైతు సంఘం అధ్యక్షుడు కర్నాటి జై బాబు రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు పెడకంటి రామకృష్ణ, మండల పార్టీ కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, మాజీ ఎంపీపీ అత్తునూరి రంగా రెడ్డి, మాజీ సర్పంచ్ లక్కినేని కృష్ణ, సర్పంచులు నందిగామ ప్రసాద్, రావి సూర్యనారాయణ, గంగవరపు శ్రీనివాసరావు, భూక్య మాన్ సింగ్, కర్నాటి సాంబశివారెడ్డి, మందపాటి మాధవరెడ్డి, జక్కంపూడి కిషోర్, శరబు వెంకటేశ్వరరావు, వల్లభనేని బాబురావు, కొమ్మినేని రామారావు, కర్నాటి శ్రీనివాసరెడ్డి, ఫైళ్ల రాధాకృష్ణ, వల్లభనేని శ్రీనివాసరావు, బొక్క వెంకటేశ్వర్లు, శీలం కిరణ్, సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Post a Comment