నేటి నుండి భద్రాద్రి పట్టణంలో బూత్ బూత్ కి సిపిఐ...
ప్రజా సమస్యలపై వార్డుల వారిగా సమగ్ర సర్వే చేయండి.
పోరాటాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం
బడ్జెట్లో భద్రాచలం పట్టణాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం..
భద్రాచలం పట్టణ సిపిఐ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు
సి కె న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఫిబ్రవరి 07,
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భద్రాచలం పట్టణ కార్యవర్గ సమావేశం లంకపల్లి విశ్వనాథ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భద్రాచలం పట్టణంలో ప్రజల సమస్యలపై స్థానిక సమస్యలపై వార్డుల వారీగా సమగ్ర సర్వే చేసి సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్మించాలని ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో భద్రాచలం పట్టణానికి మరొకసారి అన్యాయం జరిగిందని గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన 100 కోట్లు నాడు వరదల కారణంగా ప్రకటించిన 1000 కోట్ల మీద స్పష్టత లేదని అన్నారు
భద్రాచలం పట్టణాన్ని మూడు ముక్కలు చేసే జీవో నెంబర్ 45. ఈ బడ్జెట్ సమావేశాల్లో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని 39 బూతులలో బూత్ కమిటీల ద్వారా పార్టీని ప్రతిష్టపరిచేందుకు నేటి నుండి బూత్ బూత్ కు సిపిఐ నినాదంతో కార్యకర్తలు ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్, సిపిఐ నాయకులు బల్ల సాయికుమార్, .మారెడ్డి శివాజీ, దారపునేని రమేష్ బత్తుల నరసింహులు, మువ్వా రామలక్ష్మి, హిమాం కాసిం, ఎస్ వి ఎస్ నాయుడు, పడిసిరి శ్రీనివాసరావు, విద్యార్థి యువజన సమాఖ్య నాయకులు వంకపాటి తిరుపతిరావు, మారెడ్డి గణేష్, డానియల్ ప్రదీప్ తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment