నేటి తో శాస్త్రోక్తంగా ముగిసిన భద్రాద్రి హరిహర క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాలు.
CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఫిబ్రవరి 05
పావన గోదావరి నది తీరాన తెలంగాణ శబరిమల గా విలసిల్లుతున్న భద్రాద్రి హరిహర క్షేత్రం లో వేంచేసియున్న హరిహర సుతుడు కరిమల వాసుడు అయ్యప్ప స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శబరిమల విధానం లో శ్రీమాన్ సంజీవన్ తంత్రీ వారి నేతృత్వం లో నేడు శాస్త్రోక్తంగా స్వస్తి పలకడం జరిగింది. ముందుగా ప్రాతఃకాల పూజా కార్యక్రమాలతో ప్రారంభించి శుద్ధి పూజ, కలశ పూజ, అష్టద్రవ్య గణపతి హోమము, ప్రాయహ్ చిత హోమము, గాయత్రి హోమము, కలశపూజ, అభిషేకం, నైవేద్యం, హారతి, అదే విధంగా ఆలయ ప్రాంగణం లో వేంచేసి ఉన్న గణపతి, నాగరాజు, కుమార స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి , మాలికాపురత్తమ్మ, నవగ్రహములకు అభిషేకాది హారతి, నైవేద్యం నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి,ఆశీర్వచనం తీర్ధ ప్రసాద వినియోగం నిర్వహించినారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ జరిగింది.నేటి కార్యక్రమాలలో ఆలయ అర్చకులు అరుణ్ రామచంద్ర నంబుద్రి ,కమిటి అధ్యక్షులు అడుసుమిల్లి జగదీష్, కమిటి సభ్యులు, ఉభయ దాతలు భక్తులు పాల్గొన్నారు.
Comments
Post a Comment