అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటమే ఉస్తెల విశాక్ కు ఇచ్చే నిజమైన నివాళి...

 అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటమే ఉస్తెల విశాక్ కు  ఇచ్చే నిజమైన నివాళి...


 

విశాక్ 13వ వర్ధన్ సభలో ఒకతల పిలుపు




సి కె న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 07,


భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీ నందు జరిగిన ఉస్తేల విశాక్ 13 వ వర్ధంతి సభ సందర్భముగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి స్తూపం దగ్గర ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ చేసినారు, చిత్రపటానికి జిల్లా కమిటీ సభ్యులు ఎం రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే విశాక్ అకాల మరణం చెందినారని ఆయన మరణం సిపిఎం పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. పార్టీలో పని చేసేటప్పుడు యువజన సంఘం డివైఎఫ్ఐ లో ఉంటూ అతి చిన్న వయసులోనే 40 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని అలాగే ఏ.ఎం.సీ కాలనీ ఏర్పాటు విషయంలో గాని అభివృద్ధి విషయంలో ఎంతో పాటుపడినరని ఆ ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా సహాయ కార్యక్రమాలు చేసేవారని పట్టణంలో ఆరోగ్యపరంగా ఎవరికి ఏ సహాయం కావాలన్నా వెంటనే స్పందించే వారిని అన్నారు. ఆ విధంగా చనిపోయి  నేటికి  13 సంవత్సరాలు గడుస్తున్న ప్రజల గుండెల్లోనే ఉన్నారని నేడు ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు బడ్జెట్ల  పేర్లతో ప్రజల సంపదనంతా కరిగిస్తున్నారని. ప్రజా వ్యతిరేక పరిపాలన కొన సాగిస్తున్నారని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతోన్మాదాన్ని కులతత్వాన్ని రెచ్చగొడుతూ కాలం  గడుపుతున్నదని అదాని  విషయంలో ఒకవైపు పార్లమెంటు దద్దరిల్లుతున్న సరే ఈ బీజేపీ ప్రభుత్వం నిమ్మకు  నీరు ఎత్తినట్టు  ఉంటుందని ప్రజల సంపద మొత్తాన్ని కేవలం కొంతమంది వ్యక్తులకి ధారపోస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమం వుస్తెల జ్యోతి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వైవి రామారావు ,పి సంతోష్ , ఎన్ లీలావతి పట్టణ కమిటీ సభ్యులు, డి లక్ష్మి, యు జ్యోతి ,కుంజ శీను ,జీవనజ్యోతి ,శాఖా కార్యదర్శులు అల్లాడి సత్యవతి, కాకా రమణ, మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments