వెంకటాపురం మండలం లో త్రాగునీరు వృధా

 *ములుగు జిల్లా నూగుర్ వెంకటాపురం మండలం లో త్రాగునీరు వృధా*


"ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్.."




{వెంకటాపురం మండలంలోని మినీ మేజర్ గ్రామపంచాయతి పరిధిలో త్రాగునీటి  విషయంలో అధికారుల  నిర్లక్ష్యం, రానున్న వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండవచ్చని "వాతావరణ శాఖ లేక "ద్వారా తెలుసుకున్న "సీఎం కేసీఆర్" మండుటెండల విషయంలో నేటి బాలలే రేపటి పౌరులు అన్న నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే వేసవి సెలవులను ప్రకటించబోనున్న విషయం మనందరికీ తెలిసిందే ఎండాకాలంలో సాధారణంగా ప్రజలు ఎదుర్కొనే సమస్య త్రాగునీరు, వేసవిలో భూగర్భంలో నీటి జల తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నందున త్రాగునీటి విషయం పట్ల గ్రామపంచాయతీ అధికారులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది,,! కావున వృధాగా టాప్స్ లేని నల్లాల విషయంలో గ్రామ అధికారులు శ్రద్ధ వహించి నల్లాల మరమ్మత్తుల విషయంలో సమయం ను కేటాయించి త్రాగునీరు వృధా కాకుండా రానున్న వేసవిలో ముందస్తు జాగ్రత్తగా నీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నందున అంతేకాకుండా సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలలో ఒకటైన మిషన్ భగీరథ వాటర్ కలెక్షన్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మిషన్ భగీరథ నీరు రావు వస్తే బురుదలు వస్తున్నాయి అని ఇటీవల గ్రామ సభలలో జనాలు ఇచ్చిన పిటిషన్లు కుప్పలుగా పడి ఉన్నాయి  మిషన్ భగీరథ పైపులు వట్టిగా వదిలేసి ఉన్నందున నీరు వృధాగా పోయి పంచాయతీ రోడ్లు మరియు జాతీయ రహదారులపై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా ఏర్పడుతున్నాయి....

Comments