రైతుల గోస పట్టించుకునేది ఎవరు?

 *రైతులను మోసం చేసిన తెలంగాణ సర్కార్*


*ఖమ్మానికి కరెంటు కరువు ఇంకా ఎన్నాళ్లు*


*రైతుల గోస పట్టించుకునేది  ఎవరు*


*మొక్కజొన్న రైతులు నీటి కోసం మొత్తుకుంటున్న పట్టించుకుని అధికార యంత్రాంగం*


*నిద్ర మానుకొని నీటి కోసం ఎదురుచూపులు*


 *వేయి కళ్ళతో  కరెంటు కోసం ఎదురుచూస్తున్న రైతులు*




*సి కె న్యూస్ ప్రతినిధి మధిర*:-  


ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లు మండలం ఆలపాడు గ్రామంలో రైతుల బాధ ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియక తీవ్ర అవస్థలు చెందుతున్న మొక్కజొన్న మరియు మిర్చి రైతులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంటు అందిస్తున్నామని ఆయకట్టు చివరి వరకు సాగర్ జలాలు విడుదల చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప చేసి చూపించడం లేదని ఆళ్లపాడు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాగర్ జలాలు వార బందుగా విడుదల చేస్తున్నారని ఈ వారు బందులో భాగంగా చిట్టచివరి ఉన్న పొలాలకు నీరు అందడం లేదని కాలువలు పక్కన ఉన్నప్పటికీ కాలువల్లో రైతుల కన్నీరు తప్ప సాగర జలాలు పారే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మరోవైపు కరెంటు కష్టాలు చెప్పుకోలేనివని పంటలు ఎండిపోతుంటే నీళ్ల కోసం మోటర్లు అద్దెకి తీసుకొని మరి పొలాలు తడుపుకుందామంటే సరైన కరెంటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నిసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పటికీ గూగుల్లో సెర్చ్ చేసి సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన ప్రయోజనం లేదని రైతులు వాపోతున్నారు

Comments