జర్నలిస్టులకు వెలుగులు నింపిన సీఎం కేసీఆర్

*జర్నలిస్టులకు వెలుగులు నింపిన సీఎం కేసీఆర్*


*మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ*


*సీఎం కెసిఆర్.. మంత్రి పువ్వాడ చిత్రపటాలకు జర్నలిస్టుల పాలాభిషేకం*


*ఖమ్మంలో జర్నలిస్టుల హర్షాతిరేకాలు*



ఖమ్మం ఫిబ్రవరి 7: అనేక దశాబ్దాల  ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కలలను సహకారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లు ఖమ్మం జర్నలిస్టులకు వెలుగులు నింపే విధంగా  ఇండ్ల పట్టాల  పంపిణీకి శ్రీకారం చుట్టారు.

 ఖమ్మం నగరంలోని  జర్నలిస్టులకు మొదటి దశ ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈనెల10 న లేదా 14న మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న నేపథ్యంలో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తూ TUWJ TJF  ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మంత్రి తన్నీరు హరీష్ రావు చిత్రపటాలకు ఘనంగా పాలభిషేకం నిర్వహించడం జరిగింది.


ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్  బాబు  మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీని తూచా తప్పకుండా మాట నిలబెట్టుకున్న నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అని అన్నారు. 

జర్నలిస్టులు అనేక ఏళ్లుగా  ఇండ్ల స్థలాల కోసం  ఎదురుచూస్తున్నారని, వాళ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం కేసీఆర్ ను ఒప్పించి ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేత స్పష్టమైన హామీని ఇప్పించడంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సఫలీకృతులు అయ్యారని పేర్కొన్నారు.


జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సాగద్యంలో ఎవ్వరికి అనేక దఫాలుగా మంత్రులను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి వినత పత్రాల రూపంలో అభ్యర్థించడం జరిగిందని, వివిధ రూపాలలో తలపెట్టిన ఉద్యమాల ఫలితంగా  జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కడం అభినందనీయమని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. జర్నలిస్టుల కళ్ళల్లో వెలుగులు నింపిన  సర్కార్ కు రుణపడి ఉంటామఅన్నారు. 

పాలాభిషేకం కార్యక్రమం ఉత్సాహపరితంగా ఆనందోత్సవాల నడుమ కొనసాగింది.


ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి జీవన్ రెడ్డి, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యల్లమందల జగదీష్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ కే జానీ పాషా, జిల్లా, నగర నాయకులు పానకాలరావు, వల్లూరి సంతోష్, జక్కుల వెంకటరమణ, ఆర్ కె, తిరుపతి రావు, రోసి రెడ్డి, వెంకటరెడ్డి, రంజాన్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments