ఎమ్మేల్యే సాయన్న మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం.*
సికే న్యూస్ ప్రతినిధి ఖమ్మం
గత కొంతకాలంగా
ఆయన అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న (72) మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు సంతాపం తెలియజేశారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయనకు ఉందని, ప్రజలతో ఎప్పుడు మమేకమై అనేక సమస్యలను పరిష్కరించి, మృదు స్వభావిగా మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.
సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Post a Comment