పార్ట్ టైం ఫ్యాకల్టీ గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

పార్ట్ టైం ఫ్యాకల్టీ  గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.


భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతం పోట్రూ.


CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి


 ఫిబ్రవరి 01



     2022- 23 విద్యా సంవత్సరమునకు గాను ఖమ్మం రీజియన్ లో గల గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయుటకు బోధన సిబ్బంది (పార్ట్ టైం ఫ్యాకల్టీ )కొరకై అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతం పో ట్రూ ఒక ప్రకటనలో తెలిపారు. బోధన సిబ్బంది నియామకం పొందగోరు అభ్యర్థులు డిగ్రీ / పీజీ నందు 55 శాతం 

మార్కులతో పాటు ఏదైనా యూనివర్సిటీ నుండి బీఈడీ పూర్తి చేసి  మరియు టెట్ పాసై ఉండాలని అన్నారు. 

    ఖమ్మం రీజియన్ (ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)లో గల ఖాళీల వివరాలు పిజిటి గణితము- 02 ,పి జి టి భౌతిక శాస్త్రం- 02,టిజిటి సైన్స్- 01,మొత్తం ఐదు సీట్లు కలవని అన్నారు. 



      కావున అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నకలు విద్యార్హతల ధ్రువపత్రములతో జతపరిచి నేరుగా రెండు 02 ఫిబ్రవరి 23 ఉదయం 10 గంటల నుండి 04 ఫిబ్రవరి 2023 సాయంత్రం 5 గంటల వరకు ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయము( గురుకులం)..ఐటీడీఏ భద్రాచలం నందు కార్యాలయ పని దినాల్లో మాత్రమే సమర్పించాలని, మరియు దరఖాస్తు ఫారం ఖరీదు రూపాయలు 100/- అభ్యర్థులు సాధించిన అర్హత మార్కులు ఆధారంగా మరియు డెమో ద్వారా మాత్రమే ఎంపిక చేయబడునని తెలుపుతూ పైన చూపిన ఖాళీల సంఖ్యను తగ్గించుట, పెంచుటకు మరియు ఈ ప్రకటన పూర్తిగా రద్దు పరచుటకు శ్రీయుత ప్రాజెక్టు అధికారి ఐటి డి ఎ భద్రాచలం వారికి పూర్తి అధికారం కలదని తెలుపుతూ, మహిళా విద్యాలయంలో మహిళకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, ఇంకా ఏమైనా వివరాలు  

కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9 5 5 0 7 3 0 2 6 1/ 9 9 4 9 7 2 3 2 9 1  ఫోన్ ద్వారా తెలుసుకోగలరని ఆయన కోరారు.

Comments