రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఐటీడీఏలు ఎదుట ధర్నా

 రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఐటీడీఏలు ఎదుట ధర్నా 


ట్రైబల్ టీచర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కమిటీ


CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి 

ఫిబ్రవరి 04




భద్రాచలం  ట్రైబల్ టీచర్స్ యూనియన్ జేఏ సి రాష్ట్ర కమిటీ తీర్మానం మేరకు  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఉమ్మడి ఐటిడిఏలు (భద్రాచలం,ఏటూరి నాగరం,ఉట్నూర్) కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి, ప్రాజెక్ట్ అధికారులకు ఏజెన్సీ చట్టాలతో కూడినవినతి పత్రం సమర్పించాలి 08.న చలో అసెంబ్లీ కార్యక్రమం.డిమాండ్లు జీవో ఎం ఎస్ నెంబర్ 3 పై సుప్రీంకోర్టు తీర్పు ఏజెన్సీ ప్రాంత ప్రత్యేక చట్టాలకు విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వము,ఆదివాసి టీచర్స్ అసోసియేషన్(డైరీ నెం.16108 ఆప్ 2020)  ఇతర సంఘాలు   వేసిన రివ్యూ పిటిషన్లు నేటికీ పెండింగ్లో ఉన్నందున 2014 సంవత్సరంలో అన్ని పదోన్నతులు లోకల్ ట్రైబల్ టీచర్స్ లకే ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తుది తీర్పుకు లోబడి ప్రస్తుతం  ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ ట్రైబల్ టీచర్స్ లకే పదోన్నతులు కల్పించాలని 5వ షెడ్యూల్ ప్రాంతంలో అన్నీ యాజమాన్యాల లో ఏజెన్సీ మరియు మైదాన ప్రాంతాలను వేరు వేరుగా వర్గీకరించి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి.మైదాన ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు పదోన్నతులలో  అడక్వసి నిబంధనలకు లోబడి నూతన జిల్లాలో నూతన మెరిట్ కమ్ రోస్టర్ ఇచ్చి  పదోన్నతులు కల్పించాలి. ట్రైబల్ టీచర్స్ యూనియన్  జేఏసీ పిలుపును వివిధ జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ తమ జిల్లా పరిధిలో ఉన్న గిరిజన ఉపాధ్యాయులందరిని పాల్గొనేలా చేయండి. ట్రైబల్ టీచర్స్ యూనియన్ జేఏసీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి గిరిజన ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయడంలో బాధ్యతగా స్వీకరించాలని కోరనైనది.

Comments