జె. పి బిల్డర్స్ & డెవలపర్స్ కార్యాలయం ప్రారంభోత్సవంనకు విచ్చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు*
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల కేంద్రములో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సమక్షంలో ఘనంగా ప్రారంభించిన నూతన జె. పి & డెవలపర్స్ కార్యాలయం.
ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రములో JP బిల్డర్స్ &డెవలపర్స్ నూతన కార్యాలయాన్ని బోథ్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ రాథోడ్ బాపురావు గారి చేతిమిదిగా ప్రారంభోత్సవం జరిగింది.
ఈ నేపథ్యంలో గౌరవ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ, అనేక సంవత్సరాలనుండి నాకు డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ గారికి మంచి స్నేహబంధం ఉందని నా మిత్రుడు పీటర్ నాయక్ గారి కుమారుడు జాన్ సమూయేలు లకావత్ గారు అతి చిన్న వయసులో సివిల్ ఇంజనీరింగ్ చదువులో రాణించి ఇచ్చోడా ఆదిలాబాద్ జిల్లా
చుట్టుపరిసరాల్లో కన్స్ట్రక్షన్ నిర్మాణంలో తన వంతుగా ప్రజలకు అందుబాటులో అంటూ చక్కని బిల్డింగ్స్ నిర్మాణంలో అనేకులకు అనుకూలంగా ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని బట్టి చాలా సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు, అధికారులు అన్ని విషయాల్లో వారికి సహకరించి వారికి ఇంకా అనేకమైన ప్రాజెక్ట్స్ నిర్మాణాలు చేపట్టుటకు సంహరించాలని కోరారు.
జాన్ సమూయేలు గారికి స్థలమిచ్చి మండల కేంద్రంలో అందరికి అనుకూలమైన మరియు పోలీస్ స్టేషన్ కు దగ్గరలో JP బిల్డర్స్ &డెవలపర్స్ కార్యాలన్నీ కలిగి ఉండానికి సహకరించిన మొహమ్మద్ అర్ఫత్ అలీ గారికి కృతజ్ఞతలు.
జాన్ సమూయేలుతో పాటు తానుకూడ బిల్డర్స్ పనులను అభివృద్ధి చేసుకోవడానికి ఇదో చక్కటి అవకాశం అని పేరుకున్నారు. డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కుమారుడు అనేకులకు ప్రయోజకుడుగా ఎదిగినందుకు నా మిత్రుడి విషయంలో చాలా అతిశయిస్తున్నాను అని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు సభముఖంగా వారిని అభినందించారు.
టీ.ఆర్.ఎస్ కన్వినర్ కృష్ణ రెడ్డి,
స్థానిక ఎంపీపీ ప్రితం రెడ్డి, మార్కెటింగ్ చైర్మన్, సర్పంచ్ సునీత, మాజీ సర్పంచ్ దేవానంద్, సి.ఐ. మరియు తదితరులు మాట్లాడుతూ, జాన్ సమూయేలు, డాక్టర్ పీటర్ నాయక్ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించుటకు వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మా సహాయాసహకారాలు ఎప్పుడు వారికి ఉంటాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Comments
Post a Comment