బహుజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష
CK న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఫిబ్రవరి 05,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గం భద్రాచలం స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు బహుజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన సంక్షేమ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ.వి రావు మాట్లాడుతూ వరదల సమయంలో భద్రాచలం వచ్చిన కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు భద్రాచలానికి అభివృద్ధికి ప్రకటించి ఆరు నెలలు అవుతున్న ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని ఇకనైనా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో వెయ్యి కోట్ల రూపాయలు భద్రాచలానికి అభివృద్ధికి కేటాయించాలని ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఈ యొక్క దీక్ష ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనీ ఉద్దేశంతో ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు
డాక్టర్ భాను ప్రసాదు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు దుర్గాప్రసాద్, జనతా పవర్ యూత్ అధ్యక్షులు ప్రకాష్,గురజాల వెంకటేశ్వర్లు,దాసరి శేఖర్ యొక్క దీక్షకు సంఘీభావం తెలిపినారు.
Comments
Post a Comment