లింగాలకు బండికి పొత్తు కుదిరిందా!
*కమ్యూనిస్టు పార్టీ లో ఎడ మొహం పెడ మొహం*
*కెసిఆర్ చలవతో ప్రాణ స్నేహితులుగా మారిన వైనం*
*ప్రజలు పిచ్చోళ్ళ లేక నాయకులు తెలివిగలవారా*
*మధిరలో ఒకప్పటి శత్రు రాజకీయం ఇప్పుడు మిత్ర రాజకీయంగా మారిందా*
*సి కె న్యూస్ ప్రతినిధి మధిర* :-
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలో నీ సత్తా ఎంత నా సత్తా ఎంత చూపించుకునే అంత రేంజ్కి ఎదిగిన ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకరు అధికారంలోకి వెళ్లిన తర్వాత మరొకరు ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ అధికారాన్ని ఉపయోగించుకోవటానికి మిత్రులుగా వ్యవహరిస్తున్నారా లేక ప్రతిపక్ష పార్టీ సపోర్ట్ తో ఎమ్మెల్యేగా గెలవడానికి మిత్రులుగా నటిస్తున్నారా అనేది మధిర నియోజకవర్గం ప్రజల్లో చర్చనీయాంశమంగా మారింది ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ పనిచేసినటువంటి పెద్ద నాయకులు లింగాల కమల్ రాజు వర్సెస్ బండి రమేష్ గా మధిర నియోజకవర్గం లో పోటాపోటీగా నిలిచిన ఇద్దరు నాయకులు ఇప్పుడు ఒక ప్రతిపక్షంగా మరొక బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాండేట్గా ముందుకు వస్తున్నారు ఇందులోని అంతరార్మియం ఏంటో అర్థం తెలియదులే గాని ఒకప్పుడు శత్రువులుగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకు మిత్రులుగా ఉంటున్నారు అనేది మధుర నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం
Comments
Post a Comment