సమస్యల వలయాలుగా బీసీ గురుకులాలు

 *సమస్యల వలయాలుగా బీసీ గురుకులాలు*



*విద్యార్థినికి నాణ్యమైన భోజనం అందించడంలో గురుకులాల యాజమాన్యం వైఫల్యం*


*విద్యార్థులకు నాణ్యమైన అందించాలి* *AISF*


*మడుపల్లి లక్ష్మణ్ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు*


మధిర: మధిర పట్టణంలోని  భరత్ స్కూల్లో బిల్డింగ్ లో ఉన్న మహాత్మ జ్యోతిబా పూలే  ఎర్రుపాలెం బీసీ గర్ల్స్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని *ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్* అన్నారు. గురువారం నాడు గురుకుల పాఠశాలలో లక్ష్మణ్ సందర్శించి విద్యార్థినిల తో కలిసి భోజనం చేయడం  జరిగింది.


ఈ సందర్భంగా  మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని సరిగా ఉడికించని కూరలు నీళ్ల చారు నీళ్ల మజ్జిగ తో విద్యార్థులు చాలీచాలని ఆకలితో ఇబ్బందులు గురవుతున్నారని , కనీసం వంటగదిలో విద్యార్థులకు వండించడానికి వర్కర్లు లేక విద్యార్థులే వడిస్తున్నారని ఇలా పిల్లలే వడ్డించడం వల్ల మూడు నెలల క్రితం ఖమ్మం ఎస్ ఎన్ మూర్తి పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పై సాంబార్ పొడి గాయాలు అయిన సంఘటన మరిచి ఇప్పుడు కూడా ఇలానే గురుకుల పాఠశాలలో విద్యార్థులు వడ్డిస్తున్నారని ప్రిన్సిపాల్ ని అడగ్గా మా బీసీ గురుకుల సొసైటీలో విద్యార్థులే వడ్డిస్తారని సమాధానం చెప్పడం జరుగుతుంది. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు గురుకుల పాఠశాల సందర్శించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Comments