నిరుద్యోగులైన గిరిజన యువతి యువకుల కు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు

నిరుద్యోగులైన గిరిజన యువతి యువకుల కు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు.


జేడీఎం హరికృష్ణ



సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి.


 ఫిబ్రవరి 16


      ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగులైన గిరిజన యువతి యువకుల కు ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలు చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఐటీడీఏ భవిత 

 సెల్ ద్వారా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని జేడీఎం హరికృష్ణ అన్నారు. 


      గురువారం నాడు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పోట్రు  ఆదేశాను సారం ఐటీడీఏ ప్రాంగణంలోని వై టి సి లో నిర్వహించిన వివిధ ప్రైవేట్ కంపెనీలలో నెలకు పదివేల నుండి 20 వేల రూపాయల వరకు వేతనంతో కూడిన వివిధ ఉద్యోగాల కొరకు నిర్వహించిన ఇంటర్వ్యూకు 150 మంది యువతీ, యువకులు హాజరు కాగా దాంట్లో 84 మంది వివిధ ప్రైవేట్ రంగంలో జీవనోపాధి పొందటానికి ఉద్యోగాలకు అర్హత సాధించారని ఆయన అన్నారు. మొత్తం 7 ప్రైవేట్ కంపెనీలు భద్రాచలం ,పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ నుండి వచ్చిన కంపెనీల యజమానుల సమక్షంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. సన్ సైన్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ కంపెనీలో  కేర్ టేకర్ ,నర్స్ పోస్టులకు ఆరుగురు, వరుణ్ మోటార్ కంపెనీ లో సేల్స్ మెన్, అండ్ సర్వీస్ అడ్వైజర్, టెక్నీషియన్ పోస్టులకు పదిమంది ,భారత్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీలో

 లోన్ అఫైర్స్ పోస్టులకు 17 మంది, రిలయన్స్ లైఫ్ టెలికాలర్ లిమిటెడ్ కంపెనీలో

 కస్టమర్ గైడ్స్ పోస్టులకు 22 మంది ,నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ ,క్లర్క్ పోస్టులకు 9 మంది ,ఓ పి డి ఎస్ కంపెనీకి సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు 15 మంది, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ కంపెనీకి క్లర్క్ పోస్టులకు ఐదుగురు ఎంపికైనట్లు ఆయన అన్నారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన 84 మందికి ఆయా పోస్టులలో జాయిన్ అవ్వడానికి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన అన్నారు. 

         ఈ కార్యక్రమంలో ఐటీడీఏ భవిత సెల్ సహాయకులు స్వరూప, సమ్మయ్య, పాపారావు ,ఏడు కంపెనీల యజమానులు పవన్, గోపి ,మనోజ్ ,అనిల్, సుబ్రహ్మణ్యం, శ్రీరామ్, మధుకర్ ,తదితరులు పాల్గొన్నారు.

Comments