జిల్లాకు ప్రెసిడెంట్ & వైస్ ప్రెసిడెంట్ లను నియమించిన NNHRF

ఆదిలాబాద్ జిల్లాకు ప్రెసిడెంట్ & వైస్ ప్రెసిడెంట్ లను  నియమిస్తూ ఉత్తర్వులు జారిచేసిన నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్.



నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులపై పోరాడుతున్న విషయం అందరికి తెలిసినదే.

ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులను ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో పలుసమస్యలపై ప్రజలకు అండగా ఉంటూ పలుసమస్యలపై మానవ హక్కులు ఉల్లంగనపై దృష్టిసారించడానికి ప్రజల క్షేమంకొరకు ప్రతిష్టత్మాక నిర్ణయం తీసుకుందని నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఎన్విరాన్మెంట్ &ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ మీడియా కు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేరుకున్నారు.


పి. సురేష్ ను ఆదిలాబాద్జి జిల్లా ప్రెసిడెంట్ గా  మరియు డాక్టర్. సునీల్ పిడుగును జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారిచేసినట్లు ప్రకటనలో డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ పేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిని గుర్తించి ప్రజలకు దేశానికి సేవ చేయడానికి NNHRF అధిష్టానం ఇచ్చిన గొప్ప అవకాశాన్నిబట్టి నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ చైర్మన్, సీఈఓ శ్రీ డాక్టర్. సి.హెచ్. విజయ్ మోహన్ రావుకు  ఎగ్జిక్యూటివ్ ఆపరేటింగ్ చీఫ్ శ్రీ డాక్టర్. సి.హెచ్. ప్రవీణ్ రావుకు , జనరల్ సెక్రెటరీ శ్రీ డాక్టర్. జాన్ కాంతారావుకు, నేషనల్ ఎన్విరాన్మెంట్ &ఫారెస్ట్ రైట్స్ అఫైర్స్ చీఫ్ శ్రీ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ కు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ క్రమములో నియమించబడిన ఇద్దురు జిల్లా అధికారులు మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న అనేకమైన సమస్యలతో ముఖ్యంగా సాధారణ ప్రజలు తగిన న్యాయం జరగకపోవడంతో ప్రజలకు చట్టాలపై న్యాయస్తానాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. అటువంటి వారికి చట్టాలపై అవగాహన కలిపించి ఈ దేశ పౌరులుగా వారికున్న హక్కులను ప్రజలకు కలిపించడానికి స్వాతంత్రంగా ముందుకొచ్చి ప్రజలకు సేవచేసే గొప్ప అధికత్యత మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని కచ్చితంగా సమాజానికి ఉపయోగపడేలా మాకు ఇచ్చిన అవకాశాన్ని ఆదిలాబాద్ జిల్లా ప్రజల శ్రేయసుకొరకు నమ్మకంగా నిలబడుతామని  ఆదిలాబాద్ జిల్లా ప్రెసిడెంట్ సురేష్ మరియు , సునీల్ పిడుగు చెప్పారు.

Comments