మార్చ్ 13న ఉచిత నేత్ర వైద్య శిబిరం
సీకే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మార్చ్ 13 సోమవారం ఉదయం10గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు భద్రాచలం పట్టణంలోపాత ఎల్ఐసి ఆఫీసు ఎదురుగా గల ఆల్ పెన్షనర్స్,రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయంలో శరత్ మ్యాక్సీవిజన్ ఐ ఆసుపత్రి వరంగల్ వైద్యులచే ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, కోల్ మైన్ పెన్షనర్స్, హెల్త్ కార్డు కలిగిన వారందరు అర్హులు.
పరీక్షల అనంతరం శుక్లాలు కలిగిన వారిని ఆసుపత్రి వారి వాహనంలో వరంగల్ తీసుకువెళ్లి ఆపరేషన్ చేసి తిరిగి మన కార్యాలయంవద్ద దింపుతారు. వీరికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించి ఉచితంగా మందులు కూడా ఇస్తారు.
ఈకేంద్రంకు వచ్చునపుడు తప్పనిసరిగా హెల్త్ కార్డు తప్పనిసరిగా తీసుకు రావాల్సి వుంటుందని ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎల్ వి ప్రసాద్, కోశాధికారి డి కృష్ణమూర్తి. గౌరవ అధ్యక్షులు వై మంగయ్య, నాళం నాగేశ్వరరావు. సుబ్బయ్య చౌదరి. శివప్రసాద్. కిషన్రావు. బదరినాధ్. మాదిరెడ్డి రామ్మోహన్ రావు. తదితరులు తెలిపారు.
Comments
Post a Comment