గ్రామ దేవతలకు ప్రతినిధి బొడ్రాయి.
టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
మార్చ్ 11,
కొత్తగూడెం నియోజకవర్గం దైవ చింతనతో మానసిక ప్రశాంతత దొరుకుతుందని
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. లక్ష్మిదేవిపల్లి మండలం రేగళ్ల పంచాయతీ పెద్ద తండాలో బొడ్రాయి, ముత్యాలమ్మ ప్రతిష్ట మహోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బొడ్రాయి పండుగ నిర్వచనమన్నారు.
బొడ్రాయి ప్రతిష్టా మహోత్సవము అనేది మహాలక్ష్మి అంశ అని, బొడ్రాయి అనేది గ్రామ దేవతలకు ప్రతినిధి అన్నారు. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారన్నారు.
ప్రతీ ఒక్కరు తమ తమ మత ఆచారాల కు అనుగుణంగా దైవ చింతన ను కలిగి ఉండాలని తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని నాగా సీతారాములు అన్నారు. గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఎప్పుడూ ఆధ్యాత్మిక కాంతితో వెలుగొందే పెద్ద తండా అభివృద్ధి చెందాలనీ, దేవతా మూర్తుల అశీస్సులు గ్రామంలోని ప్రతీ ఒక్కరిపై వుండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ మడిపల్లి.శ్రీనివాసులు, ఓబిసి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు వీరబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు సాగర్,సాయి,సంతు,ఎగ్గడి.సాగర్,ప్రకాశ్, పెద్దతండా పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Post a Comment