మనిషి అనుకుంటే కానిదేముంది?

 *"మనిషి అనుకుంటే కానిదేముంది?"*


*"ఆత్మస్థైర్యంతో ఉన్నంతలో సంతోషంగా ఎలా జీవించవచ్చు?"*



మనిషి ఆశ జీవి ఆశ ఉండడం తప్పుకాదు. అయితే అత్యాశ కొన్నిసార్లు మనల్ని దారితప్పించి పలునేరాలవైపు నడిపించే ప్రమాదంలేకపోలేదు. ఉన్నంతలో ఎవరిపై ఆధారపడకుండా మంచిపేరుతో ఎదగవలసిన మనిషి ఎప్పుడైతే అత్యాశ వైపు మొగ్గుచూపుతాడో కచ్చితంగా జీతంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. తనకు తెలియకుండానే అసంతృ, అశాంతి, నెమ్మదిలేకపోవడం, ఎదుటువరితో పోల్చుకోవడంలాంటివి జరుగుతాయి. కారణం అత్యాశ అనేవ్యాధి పలుమాలుపు తిప్పేవకాశం కచ్చితంగా చోటుచేసుకుంటాయి. చాలా జాగ్రత్త పడకపోతే వేరులై ప్రాకిపోతుంది. అనేక అనర్ధాలకు దారితిస్తుంది. కాబట్టి ఎప్పుడుకూడా ఉన్నంతలో సంతోషించడం చాలా ఉత్తమం..


 పరిస్థితులు ఒక్కసారిగా తలక్రిందులు అవ్వడం వల్ల తక్కువ డబ్బుతో కుటుంబాన్ని పోషించాల్సి వస్తోందా? కొత్త రకాల జబ్బులు, ప్రకృతి విపత్తులు, రాజకీయ అల్లర్లు, యుద్ధాలు వంటివి ఆర్థిక పరిస్థితిని చిటికెలో మార్చేస్తాయి. నెలనెలా వచ్చే జీతం తగ్గిపోయినా లేదా పూర్తిగా రాకపోయినా ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. అయితే తక్కువ డబ్బుతో ఎలా సర్దుకుని జీవించవచ్చో తెలిపే కొన్ని విషయాలు..


మారిన పరిస్థితులకు అలవాటు పడకనే తప్పదు: అనగా సర్దుకుపోవడం జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకోవాలి. సమృద్ధిగా ఉన్నప్పుడు విశాలంగా బ్రతికి ఉండొచ్చు. కానీ విపత్తు, అనారోగ్యం, కోర్టు కేసులు, ఇలా చెప్పుకుంటుపోతే అనేకమైన కారణాలచే ఆర్ధికంగా చితికిపోయినప్పుడు ఒక్కసారిగా తిరిగి కోలుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మానసికంగా కృంగిపోతుంటారు. కానీ వాస్తవానికి మనిషిగా మనం అర్ధం చేసుకోవలసినది ఏమనగా! ఇలా ఉన్నతమైన స్థాయిలో ఉంటానని నీవు ఆ రోజు ఊహించకనే బ్రహ్మాండమైన జీవితాన్ని గడిపావు.


ఏమీ ఉన్నా, ఏమి లేకున్నా తృప్తిగా ఎలా జీవించాలో నేర్చుకున్నప్పుడే మనం ప్రశాంతంగా జీవితంలో ఆనందాన్ని ఆశ్వదించగలం. ఒకప్పుడు వస్తున్నంత జీతం ఇప్పుడు రాకపోయినా, ఇప్పుడు వస్తున్న డబ్బుతో తృప్తిగా జీవించడం సాధ్యమే. మారిన పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటుపడండి. ఎంత త్వరగా అలవాటుపడితే, మీరూ మీ కుటుంబం అంత త్వరగా మళ్లీ మామూలు జీవితం గడపగలుగుతారు. ప్రభుత్వం లేదా ఇతర సంస్థలు ఇచ్చే పథకాలు ఏవైనా మీకు వర్తిస్తాయేమో తెలుసుకోండి. ఒకవేళ వర్తిస్తే, వాళ్లు ఇచ్చిన గడువు పూర్తికాక ముందే వాటికి అప్లై చేసుకోండి.


కష్టం నుండి బయటపడడానికి కుటుంబమంతా కలిసి పనిచేయండి.: “ఒకరితో ఒకరు సంప్రదించుకోకపోతే ప్రణాళికలు విఫలమౌతాయి, సలహాదారులు ఎక్కువమంది ఉంటే పనులు జరుగుతాయి.” అప్పుడప్పుడు ఎంతగా చదువుకున్నా ఎన్ని తెలిసిన ఇంట్లో పెద్దవాళ్లు, అనుభవ జ్ఞానులు ఇచ్చే మంచి సూచనలు పరిగణలోకి తీసుకోండి.

 ఇంట్లో పరిస్థితి గురించి మీ భర్తతో/భార్యతో, పిల్లలతో మాట్లాడండి. దాపరికం లేకుండా మాట్లాడుకుంటే కుటుంబ సభ్యులందరికీ పరిస్థితి అర్థమౌతుంది, ఉన్నంతలో సర్దుకుని జీవించడానికి వాళ్లు కూడా సహాయం చేయగలుగుతారు. అందరూ మాట్లాడుకుని పొదుపుగా జీవిస్తే, తక్కువ డబ్బును కూడా తెలివిగా ఉపయోగించుకోగలుగుతారు.


ఎంత డబ్బును దేనికి ఖర్చు చేయాలో రాసిపెట్టుకోండి: కూర్చోని లెక్కలు రాసుకోండి.

 జీతం తగ్గినప్పుడు ఎంత డబ్బును దేనికి ఖర్చు చేస్తున్నామో రాసుకోవడం చాలా ప్రాముఖ్యం. ముందు, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మీకెంత జీతం వస్తోందో రాసుకోండి. తర్వాత, మీరు ప్రతీనెల దేనిదేనికి ఎంత ఖర్చు చేస్తారో రాసుకోండి, మీరు తగ్గించుకోవాలి అనుకుంటున్న ఖర్చుల్ని కూడా ఈ లిస్టులో చేర్చండి. 

అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఎంత డబ్బు పక్కన పెట్టాలనుకుంటున్నారో కూడా నెలవారీ ఖర్చుల్లో రాసుకోండి. చిల్లర ఖర్చుల్ని కూడా మర్చిపోకుండా రాసిపెట్టుకోండి. కొన్నిసార్లు మనకు తెలీకుండా వీటి కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తుంటాం. ఒకతను తన నెలవారీ ఖర్చులన్నీ తిరగేసినప్పుడు, కేవలం బబుల్‌ గమ్‌లు కొనుక్కోవడానికే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుసుకున్నాడు!


అవసరమైన వాటికే డబ్బులు ఖర్చుపెట్టండి. ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి. మీకు ఎంత ఆదాయం వస్తోందో, మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో పోల్చి చూసుకోండి. తర్వాత, ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవచ్చో ఒకసారి ఆలోచించండి. 

ఉదాహరణకు ఇవి గమనించండి: బైక్‌లు/కార్లు. మీ దగ్గర ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు ఉంటే, వాటిలో ఒకదాన్ని అమ్మేయగలరా? ఒకవేళ మీ దగ్గర ఎక్కువ ఖరీదైన బండి ఉంటే, దాన్ని అమ్మేసి తక్కువ ఖరీదులో మరోదాన్ని తీసుకోగలరా? అసలు సొంత వాహనం లేకుండా సిటీ బస్సులో గానీ, సైకిల్‌ మీద గానీ వెళ్లగలరా? టీవీ/సినిమాలు. మీరు కేబుల్‌ టీవీ కనెక్షన్‌ గానీ, ఇంకేవైనా ఆన్‌లైన్‌ సబ్‌స్క్రిప్షన్‌లు గానీ తీసుకొని ఉంటే వాటిని కొన్ని రోజుల కోసం క్యాన్సిల్‌ చేసుకోగలరా? వాటికి బదులు తక్కువ ఖర్చుతో ఇంకేదైనా చూసుకోగలరా? నిత్యావసరాలు. నీళ్లను, కరెంటును, పెట్రోలును పొదుపుగా ఎలా వాడుకోవచ్చో కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుకోండి. 

అవసరం లేనప్పుడు లైట్లు ఆపేయడం, తక్కువ నీళ్లు వాడడం లాంటి చిన్నచిన్న పనుల వల్ల ఎక్కువ డబ్బు ఆదా అవుతుంది. భోజనం. హోటళ్లలో తినే బదులు ఇంట్లోనే వండుకొని తినండి. ఏం వండుకోవాలో ముందే ఆలోచించుకొని అవసరమైనవి కొనుక్కోండి.  కనిపించిన ప్రతీది కొనేయకుండా, మార్కెట్‌కు వెళ్లేముందే మీకు కావాల్సిన వస్తువుల లిస్టు రాసుకోండి.  ఆరోగ్యాన్ని పాడుచేసే చిరుతిళ్లు కొనకండి. వీలైతే పెరట్లోనే కూరగాయల్ని పండించుకోండి.  


 ఏదైనా కొనాలనుకుంటే, కొనాలనుకున్న ప్రతీసారి, ‘అది కొనేంత డబ్బు నా దగ్గర ఉందా? నాకు అది నిజంగా అవసరమా?’ అని ఆలోచించండి. కొత్త వస్తువుల్ని, వాహనాల్ని కొనే బదులు ప్రస్తుతం మీ దగ్గరున్న వాటినే కొంతకాలం వాడుకోగలరా? మీకు అవసరంలేని వస్తువులు, వాడని వస్తువులు ఏవైనా ఉంటే వాటిని అమ్మేయగలరా? ఇలా చేస్తే మీ భారం తగ్గుతుంది, కాస్త డబ్బు కూడా వస్తుంది. 

మీకొచ్చే ఆదాయం అకస్మాత్తుగా తగ్గిపోయినప్పుడు, మీ ఆరోగ్యాన్ని పాడుచేసే అలవాట్లను మానుకోవడానికి ఈ అవకాశం ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు సిగరెట్‌, మందు, జూదం లాంటి అలవాట్లు ఉంటే వాటిని మానుకోండి. ఆందోళన పడకుండా నిశ్చింతగా జీవించడానికి అలవాటు చేసుకుంటే అప్పుచేసి లేనిపోని సమస్యలు లేకుండా గంజిత్రాగిన అమృతంగానే ఉంటుంది. అలా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, 


రచన:  -డాక్టర్ పీటర్ నాయక్ లకావత్

Comments