CLP నేత భట్టి పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు
హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు పాదయాత్ర చేస్తున్నాను
16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజరహత్నూర్ మండలం, పిప్పిరి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర మొదలవుతుంది
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర పాదయాత్రను డిజైన్ చేశారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది
కానీ బిఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసింది
బిఆర్ఎస్ పరిపాలనలో ఏ ఒక్క లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు
నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ధైర్యం ఇచ్చి వారికి మేము అండగా ఉన్నామని చెప్పడానికే నేను పాదయాత్ర చేస్తున్నాను.
నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పాదయాత్రలో ప్రజలకు ధైర్యం చెబుతాం
2023- 24 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తాం
దేశంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలను బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తున్నది
దేశ ఆర్థిక వ్యవస్థను బిజెపి కుప్ప కూల్చింది
ప్రధాని తన స్నేహితులైన క్రోనీ క్యాపిటల్ లిస్టులకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారు.
బిజెపి నాశనం చేస్తున్న ఈ దేశాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు.
రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశాన్ని హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా చేస్తున్న పాదయాత్ర ద్వారా ప్రతి గడపగడపకు తీసుకువెళ్తాం
కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయ మార్గం అని ఇంటింటికి చెప్తాం
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేస్తున్న పాదయాత్రలో అన్ని జిల్లాల అధ్యక్షులు, పిసిసి ఉపాధ్యక్షులు, పిసిసి ప్రధాన కార్యదర్శులు, పిసిసి సభ్యులు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాములు చేసే పర్యవేక్షణ ఏఐసిసి నిర్వహిస్తున్నది.
పాదయాత్ర లో భాగంగా మంచిర్యాల, హైదరాబాద్ శివారు, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఉంటాయి. ఈ బహిరంగ సభలకు అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకురావడానికి ఏఐసీసీ ఇన్చార్జిలు కసరత్తు చేస్తున్నారు
ఏఐసిసి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సీఎల్పీ నాయకుడిగా తెలంగాణలో పాదయాత్ర చేయడానికి మీ ముందుకు వస్తున్నాను.
మీ శక్తి మేరకు నాతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి బలోపేతం చేయాలి
తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ప్రజలకు తెలియజెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మన అడుగులు ఉపయోగపడాలి
తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అవసరాలు ఆశయాలని కాంగ్రెస్ అజెండగా మార్చుకొని నడుద్దామని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్న
ప్రగతిశీల వాదులు ప్రజాస్వామికవాదులు మేధావులు కళాకారులు తెలంగాణ కోసం పోరాడిన పోరాట యోధులు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జరిగే నా పాదయాత్రలో భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న.
మీడియా సమావేశంలో
ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఏఐసిసి కార్యక్రమాలు అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తదితరులు ఉన్నారు
Comments
Post a Comment