ABVP ఆధ్వర్యంలో ఈనెల 26న పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి

 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 26న పాఠశాలల బంద్ విజయవంతం చేయాలి



 కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈనెల 26వ తేదీన పాఠశాలల బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది..

ఏబీవీపీ నాయకుడు పోతరాజు లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ మరియు దుస్తుల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిచ్చారు 

అదే విధంగా ఈ రాష్ట్రంలో కనీస క్లాస్ రూమ్ లో లేక చెట్ల కింద కూర్చుని చదువుతున్న పాఠశాలలున్నాయన్నారు, ఉన్న వాటిని మరమ్మతులు చేయడానికి చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాలు కంటికి కనబడకుండా పోయాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కనీసం మంచి తాగునీరు, మరుగుదొడ్లు లేని పాఠశాలలు మరియు ప్రహరీ లేని అనేకం పాఠశాలలు ఉన్న పట్టించుకునే నాధుడు లేదన్నారు.

అదేవిధంగా విద్యను వ్యాపారం చేస్తూ ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాల ఫీజుల దోపిడి చేస్తూ, పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ పేరిట వ్యాపారాలు చేస్తూ, అమాయక ప్రజల రక్తం పీల్చుతున్నరు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లో చలనం లేని కారణంగా ఈనెల 26 తేదీన పాఠశాలల బందుకు పిలుపునివ్వడం జరిగింది అన్నారు. ఈ పాఠశాలలో బందుకు మీరంతా సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో చరణ్ రోహిత్ సంజయ్ ఖలీల్ సమీర్ సాయి లక్కీ తదితరులు పాల్గొన్నారు.

Comments