*ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ*
సికే న్యూస్ ప్రతినిధి
ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తితో నియోజకవర్గ పరిధిలోని తల్లాడ- కల్లూరు - పెనుబల్లి - సత్తుపల్లి మార్గాన్ని మరింత విస్తరస్తూ, అభివృద్ధి పర్చుతూ, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటుకు వినతి పత్రం.*
ఖమ్మం జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రమిచ్చిన ఎంపీ రవిచంద్ర*
సానుకూలంగా స్పందించిన మంత్రి గడ్కరీ*
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.పార్లమెంటులోని మంత్రి ఛాంబర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన గడ్కరీని కలిశారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తెలంగాణలోని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి విజ్ఞప్తి మేరకు ఖమ్మం జిల్లాలో తల్లాడ-కల్లూరు-పెనుబల్లి-సత్తుపల్లి మార్గాన్ని మరింత విస్తరస్తూ, అభివృద్ధి పర్చుతూ,సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా వినతిపత్రం అందజేశారు.ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయవలసిందిగా ఎంపీ రవిచంద్ర కోరగా, మంత్రి గడ్కరీ వెంటనే సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.
Comments
Post a Comment