బీసీ సింహ గర్జన భారీ బహిరంగ సభ సక్సెస్

బీసీ సింహ గర్జన భారీ బహిరంగ సభ సక్సెస్

సికే న్యూస్


బీసీ సింహ గర్జన భారీ బహిరంగ సభ హైదరాబాద్ కు సూర్యాపేట నుండి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సిహ్మా ఆధ్వర్యంలో బీసీ  నాయకులు కార్యకర్తలు భారీగా హైదరాబాదుకు తరలి వెళ్లారు 

అనంతరం చలమల్ల నర్సింహ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల్లో జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు బిఆర్ఎస్ ,బిజెపి, కాంగ్రెస్ జాతీయ ,ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా 50 శాతం 60 MLA టికెట్లు బీసీ లకు ఇవ్వాలనీ, బీసీ ముఖ్యమంత్రిని చేయాలనిడిమాండ్ తో బీసీ సింహ గర్జన సభను  ఏర్పాటు చేయడం జరిగింది.  

బీసీలకు జనాభా ప్రాతిపదిక పై తమాషా పద్ధతి ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం 60 ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఎన్నికల ముందే డిక్లరేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావి సీట్లు మావే అనే నినాదంతో బీసీలంతా ఏకమై రాబోయే ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వని పార్టీలకు బీసీలo తగిన బుద్ధి  

చెప్తామని అదేవిధంగా నామినేషన్ పోస్టులను కూడా బీసీలకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరలి వెళ్లిన వారిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు బీసీ జిల్లా నాయకులు దాసరి వెంకన్న యాదవ్ బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు  నియోజకవర్గ అధ్యక్షులు మట్ట రమేష్ యాదవ్, ఉప్పు శ్రీనివాస్, బోరా రమేష్, గంగాధర జానకి రాములు వర్కాల సైదులు,బిమరబోయిన సైదులు, వెంకన్న పిల్లలమర్రి పుల్లయ్య తదితరులు వెళ్ళినారు.

Comments