కోతకు గురై తెగిన చెరువును పరిశీలించన ఎమ్మెల్యే సీతక్క

 *కోతకు గురై తెగిన మారేడు గుండ చెరువును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క*


"ములుగు జిల్లా సీకే న్యూస్ ప్రతినిధి భార్గవ్"


ఈ రోజు వేంకటా పూర్ మండలం లోని లక్ష్మీదేవిపేట భూర్గు పేట మధ్యలో ఉన్న మారేడు గుండ చెరువు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిన్న రాత్రి కోతకు గురైన మారేడు గుండ చెరువును పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క 

ఈ సందర్భంగా మాట్లాడుతూ


గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో అనేక చెరువులు కుంటలు తెగిపోవడం జరుగుతుంది అధికారులు అప్రమత్తం గా ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు అవసరం

 అయితే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దని అదే విధంగా శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సీతక్క  అన్నారు మారేడు గుండ తెగిపోవడం తో రైతులకు తీవ్రనష్ట జరిగిందని అధికారులు వేను వెంటనే చెరువు మరమ్మతు పనులు మరియు రాక పోకలకు అంతరాయం కలగకుండా రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని 

ముంపుకు గురైన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా అధికారులు గ్రామాల్లో ఉన్న ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు 

ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు చేన్నోజు సూర్య నారాయణ

వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఆకు తోట చంద్ర మౌళి,సీనియర్ నాయకులు మీల్కురి ఐలయ్య

ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి 

కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి

కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి నునెటి శ్యామ్,ములుగు పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్ష పతి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు వీరేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు కొండ తిరుపతి, చెన్నోజూ శ్రీనివాస్,అల్లం తిరుపతి

బుస గణేష్ తదితరులు ఉన్నారు...

Comments