*పాలేరు నియోజకవర్గ బంజారా ప్రజలకు సీత్లా పండుగ శుభాకాంక్షలు*
*బీఆర్ఎస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు బాదావత్ లక్ష్మణ్ నాయక్*
సికే న్యూస్ ప్రతినిధి
పాలేరు నియోజకవర్గ బంజారా ప్రజలకు గోర్ బంజారా సంస్కృతికి నిదర్శనమైన, ప్రక్రతిని పూజించే పవిత్రమైన సీత్లా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు బాదావత్ లక్ష్మణ్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాడమాసం పునర్వసు కార్తె మొదటి మంగళవారం సీత్లా పండుగను ఘనంగా జరుపుకోవడం గిరిజనుల ఆనవాయితి అని అన్నారు.
ఈ పండగ బంజారాల ప్రత్యేక పండగ అని రైతులు పండించే పంట పైరు, పాడి పశువులకు చీడ,పీడాలు రాకుండ ఉండడం కోసం, సకాలంలో వర్షాలు కురవాలని బంజారా జాతి బిడ్డలందరు కలిసిమెలసి ఊరురా సీత్లా భవానికు బోనాలు సమర్పించి ఘనంగా సీత్ల పండుగను జరుపుకుంటారని తెలిపారు.
జాతి ఐక్యతకు మారు పేరుగా ఈ పండుగ నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా యావత్ బంజారా జాతి బిడ్డలకు బాదావత్ లక్ష్మణ్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Post a Comment