*రైల్వే బ్రిడ్జిలోనికి వరద నీరు రావడంతో టాటా ఏసీ వ్యాన్ మునిగింది*
*C K న్యూస్ మెదక్ జిల్లా* *చేగుంట మండల్ ప్రతినిధి* *కొండి శ్రీనివాస్ జూలై 18*
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పరిధిలో గల బొమ్మరం గేటు దగ్గర రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన సందర్భంగా కాంట్రాక్టు నిర్లక్ష్యంతో నిర్మాణం పనులు మధ్యలోనే విడిచిపెట్టారు గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన సోమవారం రాత్రి నుండి రైల్వే బ్రిడ్జ్ లోనికి నీరు వరద రావడంతో టాటా ఏసీ వ్యాన్ గజ్వేల్ నుండి వెల్దుర్తి వెళ్లేమార్గం .
నీళ్ళు లోతుగా ఉనాయి అని తెలియని సందర్భంలో డ్రైవర్ కు తెలియకుండా పోవడంతో మధ్యలో చిక్కుకున్నది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి చర్యలు చేపట్టి పనులు నిర్మాణం చేపట్టాలని చుట్టుపక్కల రైతులు కోరుతున్నారు.
Comments
Post a Comment