గొర్రెలను పంపిణీ చేసిన "ఎమ్మెల్యే భీరం

 *పానగల్ మండల కేంద్రంలో గొర్రెలను పంపిణీ చేసిన "ఎమ్మెల్యే భీరం"*


*"కులవృత్తులను"  ఆదుకోవడమే లక్ష్యంగా "గొర్రెల పంపిణీ" కార్యక్రమం.*


*పాన్ గల్ మండల కేంద్రంలో ఆరు గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే .*


_*ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.*



సి కె న్యూస్  ప్రతినిధి/పానుగల్ :


బుదవారం పాన్ గల్ మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులతో కలిసి 6 గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ,

గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొర్రెల పంపిణీ పథకం.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా తెలంగాణ సబ్బండ  కులాల జీవనంలో గుణాత్మక మార్పులు వచ్చాయని అన్నారు.

నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.

తెలంగాణలో రాష్ట్రంలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు,బిఆర్ఎస్ నాయకులు,లబ్ధిదారులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments