కలెక్టర్ శ్రీ క్రిష్ణ ఆదిత్య IAS ములుగు జిల్లాకి చేసిన అభివృద్ధి,సేవలు అనీర్వచనియం

కలెక్టర్ శ్రీ క్రిష్ణ ఆదిత్య IAS ములుగు జిల్లాకి చేసిన అభివృద్ధి,సేవలు అనీర్వచనియం


అభినందనీయం.:జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్


"ములుగు జిల్లా సీకే ప్రతినిధి భార్గవ్"

 



    గత మూడున్నర సంవత్సరాలుగా ములుగు జిల్లా కలెక్టర్ గా విశేష సేవలు అందించి ములుగు జిల్లాను ఎంతగానో అభివృద్ధి చేసి  ఉత్తమ పంచాయితీ విభాగంలో దేశంలో ములుగు జిల్లాను రెండవ స్థానంలో నిలపడం లో ఎంతగానో కృషి చేసి జిల్లా అధికారుల,ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు అని అన్నారు.

     కాలుష్య నియంత్రణ మండలి కి బదిలీ అయిన జిల్లా కలెక్టరూ క్రిష్ణ ఆదిత్య IAS కి వీడ్కోలు సమావేశం  రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఆత్మీయ వీడ్కోలు సమావేశ కార్యక్రమం ఘనంగా జరిగింది.

    ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ప్రస్తుత్త  జిల్లా కలెక్టరు శ్రీమతి ఇలా త్రిపాఠి IAS శ్రీ అంకిత్ IAS P O ఏటూరు నాగారం,శ్రీ సంకిర్త్ IPS ASP ఏటూరు నాగారం,DFO రాహుల్ కిషన్ జాదవ్ మరియు MLA సీతక్క,ముఖ్య అతిథిలుగా హాజరూ కాగా జిల్లా DMHO,అన్ని మండలలా MRO,MPDO S ,వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు, పాత్రికేయులు,కలెక్టరు కార్యాలయ సిబ్బంది,వివిధ పార్టీల నాయకులు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్  మాట్లాడుతూ  నూతనంగా ఏర్పడిన ములుగు జిల్లాను అటు అభివృద్ధి విషయంలో,సంక్షేమంలో ఎక్కడ కూడా వెనకాడకుండా అన్ని విధాలుగా అభివృధి చేయాలనే ఉద్ధేశంతో జిల్లా కలెక్టరు గా భాద్యతలు తీసుకున్న తరువాత జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని మొదటగా జిల్లాలోని  అన్ని మండలాలకు ఒక్కొక్క జిల్లా స్థాయి ఆఫీసర్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించి* జిల్లాలో ఉన్న అన్ని మండలాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువచ్చినారు అని అన్నారు.

   శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో  భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ జాతరను విజయవంతం చేసారు అని గుర్తు చేశారు.

అంతేకాకుండా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తేవడంలో గానీ,అక్కడ అభివృద్ధి చేయడం లో గాని తనదైన ముద్ర వేశారు అని  కోవిడ్ సంక్షోభం సమయంలో కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అరోగ్య శాఖ అధికారులను,డాక్టర్స్ ను అప్రమత్తం చేసుకొని ప్రజలు కరోనా బారిన పడకుండా ఏంతో కృషి చేసారు అని అన్నారు.

అంతే కాకుండా జిల్లాను అభివృద్ధి చేయడం కోసం అనేక మార్పులు తీసుకు వచ్చి అధికారులను సమన్వయం చేస్తూ అహర్నిశలు శ్రమించి ములుగు జిల్లాను అభివృధి చేసిన కలెక్టరు శ్రీ కృష్ణ ఆదిత్య IAS  రాబోయే రోజుల్లో మరెనో ఉన్నతమైన పదవి భాద్యతలు స్వీకరించాలని అని అన్నారు.

  అనంతరం జిల్లాలోని వివిధ శాఖల అధికారులు,నాయకులు,సిబ్బంది,మరియు పాత్రికేయులు శాలువాలతో,గజమలతో ఘనంగా సత్కరించి,జ్ఞాపికలు అందజేసారు...

Comments