మున్నేరు వరదకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం..
*▪️అందుకు కృషి చేసిన మంత్రి పువ్వాడ.. మంజూరు చేసిన కేసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన BRS శ్రేణులు.*
ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల కల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసింది. అనేక పార్టీలు ఏళ్ల తరబడి ఆయా ప్రాంత ప్రజలను కేవలం తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వినియోగించుకున్నరు.
నేడు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ప్రత్యేక కృషి ఫలితంగా బాధితుల చిరకాల కోరిక, ఎలాంటి ప్రణ నష్టం, అస్తి నష్టం కలుగకుండా RCC కాంక్రీట్ వాల్ నిర్మించడం ద్వారా అందరికీ మేలు జరుగుతుందని సంకల్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి అభ్యర్థన నేడు ముఖ్యమంత్రి కేసీఅర్ గారి ద్వారా పూర్తి అయింది.
మున్నేరుకు రెండు వైపులా RCC కాంక్రీట్ వాల్ నిర్మాణతో ఈ సమస్యను శాశ్వత ఫలితం ఉంటదని, కరకట్ట నిర్మాణ చేపడితే చాలా మంది ఇల్లు కోల్పోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి స్థానిక పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి క్షుణ్ణంగా నివేదించిన దరిమిలా మంత్రి ఆలోచనతో సంతృప్తి చెందిన సిఎం కేసీఅర్ గారు తక్షణమే రూ.150 కోట్లు మంజూరు చేయడం పట్ల యావత్ ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్నేరు బాధితులు పెద్ద ఎత్తున పండగ చేసుకున్నారు. తమ కష్టలు తొలగించాలని మొన్న మంత్రి పువ్వాడ కు విజ్ఞప్తి చేసిన బాధితులు రెండు రోజులు గడవక ముందే ఈ సమస్యకు పరిష్కారం చూపడం పట్ల తమపై మంత్రి పువ్వాడ కు ఎంత ప్రేమ ఉందో స్పష్టత వచ్చేసింది.
అందుకు కృతజ్ఞతగా BRS నగర పార్టీ అధ్వర్యంలో మున్నూరు నది ఒడ్డున గల బతుకమ్మ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి కేసీఅర్ గారు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు, ఖమ్మం నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జై కేసీఅర్.. జై పువ్వాడ అంటు పెద్ద ఎత్తున నినాదాలతో మున్నేరు హోరెతత్తేలా మారుమోగించారు.
Comments
Post a Comment