గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలి
_ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి ఈశ్వర్
సి కె న్యూస్ ప్రతినిధి/పెంట్లవెల్లి :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలో పని చేస్తున్న 50వేల మంది గ్రామపంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వీడి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. పెంట్లవెల్లి అంబేద్కర్ విగ్రహం ముందు చేస్తున్న సమ్మె 31వ రోజు చేరుకున్న సందర్భంగా సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మెను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఈశ్వర్ మాట్లాడుతూ31రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా గ్రామపంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆయన మండిపడ్డారు
మరొకవైపు మల్టీ పర్పస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు ప్రతి కార్మికునికి 8500 వేతనం ఇవ్వాల్సి ఉన్న ఒక కార్మికుని వేతనాన్ని ముగ్గురికి మంచి కార్మికుల యొక్క శ్రమను దోచుకుంటున్నారని ఆయన అన్నారు
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన అన్నారు బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల పడుతున్న బాధలను పట్టించుకోకుండా బంగారు తెలంగాణ అంత పచ్చగా ఉందని చెప్పడం ముఖ్యమంత్రి యొక్క అవివేకమని ఆయన అన్నారు
చర్చల పేరుతో పిలిచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం మంత్రికి ఏ మేరకు అవగాహన ఉందో ఒక్కసారి పక్క రాష్ట్రాలకు వెళ్లి చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 వేలు వేతనం కర్ణాటకలో 16 వేల వేతనం కేరళ రాష్ట్రంలో కనీస వేతనాలు అమలు చేసి ముందు బాగాన ఉంటే తెలంగాణ మాత్రం 8500 వేతనమిచ్చి గొప్పలు చెప్పుకోవడం కాదని ఆయన విమర్శించారు
ఇప్పటికైనా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్లు చిట్టెమ్మ, కృష్ణయ్య, శ్రీనివాసులు చంద్రయ్య, బాలరాజు, ఈశ్వరయ్య మామయ్య, ఖాసిం ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment