ఏఎన్ఎం ఆశ వర్కర్లకు సొసైటీ చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
సికె న్యూస్ బయ్యారం మండల ప్రతినిధి జవాజి ప్రవీణ్ కుమార్
బయ్యారం మండలం గంధంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశాలకు ఏఎన్ఎం లకు ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ, చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు మానవ అక్రమ రవాణా బాలల సమస్యలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పిహెచ్సి వైద్యాధికారి
విజయ కుమార్ అధ్యక్షత వహించగా ,చైల్డ్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ తప్పెట్ల వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని వాటిని చేసేవారిపై మరియు ప్రోత్సహించే వారిపై కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు అదేవిధంగా బాలల అక్రమ దత్తత చట్ట విరుద్ధమని ఒకవేళ బాలలను దత్తత తీసుకోవాలనుకుంటే
బాలల రక్షా భవన్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు నేడు ప్రపంచంలో మానవ అక్రమ రవాణా అనేది వివిధ రూపాల్లో విస్తరిస్తూ ఉంది, ముఖ్యంగా ప్రేమ, పెళ్లిళ్ల,ఉద్యోగాల పేరుతో, సినిమాల్లో అవకాశాల పేరుతో అమాయక కుటుంబాల పిల్లలను, యువతలను ప్రలోభ పెట్టి అక్రమ రవాణాకు గురిచేసి వారితో వెట్టి చాకిరి ,బిక్షాటన చేయించటం,, వ్యభిచార కూపంలో దించటం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు వారిని ఉపయోగించడం జరుగుతున్నది
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతపు యువతి యువకులను ప్రలోభ పెట్టి అక్రమ రవాణా చేయడం జరుగుతుందని తెలిపారు మరియు ఆన్లైన్లో పరిచయాలు పెంచుకొని వారి ఫోటోలు సేకరించి మార్ఫింగ్ చేసి వారిని బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి లోపర్చుకొని అక్రమ రవాణాకు గురిచేస్తున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి
కావున తమ పిల్లలను ఇలాంటి వారి బారిన పడకుండా తగు జాగ్రత్తలు సూచనలు చేయాలని మండల సమాఖ్య ప్రతినిధులకు సూచించారు, అపరిచిత వ్యక్తులు ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిన లొంగకుండా తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలని సూచించారు
ముఖ్యంగా నగరాల్లో ఉండి చదువుకునే యువతులు జాగ్రత్త వహించాలని సూచించారు .
పిల్లలకు ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ఉండడానికి మొబైల్ వాడకాన్ని తగ్గించడంతోపాటు వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా గ్రామాల తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పించాలని ప్రతినిధులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మానవ అక్రమ రవాణా నిర్మూలన ప్రాజెక్టు మండల కోఆర్డినేటర్ కళ్యాణి ,చైల్డ్ లైన్ నుండి సాయి చంద్ సత్యార్థి ఫౌండేషన్ నుండి శ్రీలత ఉమామహేశ్వరి మరియు వివిధ గ్రామాల నుండి హాజరైన సుమారు 50 మంది ఆశాలు పాల్గొన్నారు.
Comments
Post a Comment