మల్లేపల్లి చెరువు ముంపు బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి

మల్లేపల్లి చెరువు ముంపు బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి.

ఐ ఎఫ్ టి యు  ఆధ్వర్యంలో నూతన తహశీల్దార్  శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేత.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,( సాయి కౌశిక్ ),

ఆగస్ట్ 05,


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మల్లెపల్లి చెరువు ముంపు బాధ్యత కుటుంబాలకు ప్రత్యామ్యం ఇళ్ల స్థలాలు కేటాయించాలని డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ శనివారం నాడు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో మణుగూరు  తహశీల్దార్ గా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన టి శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని మల్లేపల్లి చెరువు బ్యాక్ వాటర్ ముంపు ప్రాంత బాధిత కుటుంబాలు   ప్రతి వర్షాకాలం చెరువు నిండినప్పుడల్లా  విష సర్పాలతో, దోమలతో సహజీవనం చేయాల్సి వస్తోందని   చెరువు ముంపు బాధిత  కుటుంబాలకు ప్రత్యేక ఇళ్ల స్థలాలు కేటాయించాలని డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఆయన కోరారు అలాగే మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయని ప్రభుత్వం స్పందించి ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు కార్యక్రమానికి ముందు మణుగూరు  తహశీల్దార్ గా నూతన పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా  శ్రీనివాస్ కి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు, సమస్యపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో ఏ మంగీలాల్, వి శంకర్ నాయక్, ఉప్పల శివరామకృష్ణ, కడారి వీర్రాజు, నామాల రామకృష్ణ, తూము వెంకటేష్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments