*ములుగు జిల్లాలో కారు వేగానికి "బ్రేక్" వేసే పార్టీకి ధీటుగా, కారు వారధిగా అధిష్టానం దృష్టిలో ఉన్నది ఎవరు..?*
ములుగు జిల్లా వ్యాప్తంగా కుడుముల లక్ష్మీనారాయణ కి అనుకుల వాతావరణం
మంగపేట మండల అధికారుల చేతి నుంచి గిరిజన బిడ్డ చేతికి పగ్గాలు ఇవ్వాలి అంటూ. జిల్లా ప్రజల కోరిక
చేతి హస్తాన్ని సైతం ఉడుముల పట్టి వెనక్కి లాగే సత్తా ఉన్నది కుడుములకే
"ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్"
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కారు జోరు, పనులు మరింత వేగవంతం అయ్యాయి, తెలంగాణ వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఇప్పటికే పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులలో దూసుకు వెళ్తున్న కారు వేగాన్ని ఎవరు ఆపలేరు అంటూ బి.ఆర్.ఎస్ కార్యకర్తల ధీమా..!
ఇదిలా ఉండగా గులాబీ జెండా పరిపాలించిన జిల్లాల పరిస్థితిని పక్కన పెడితే, కారు వేగాన్ని హస్తంతో ఆపిన జిల్లాల పరిపాలన లో ఈసారైనా గులాబీ జెండా ఎగరనున్నదా..! అనే విషయం అధిష్టానం తీసుకునే కీలక నిర్ణయం పై ఆధారపడి ఉన్నదని, బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తల ఆలోచన మరి ఈ విషయం పై గులాబీ పార్టీ అధిష్టానం గతంలో చేసిన పొరపాటే చేస్తుందా:
నాయకుడనే వాడు అసెంబ్లీలో మెంబర్గా కాకుండా, ప్రజల్లో నెంబర్ వన్ స్థానం సంపాదించుకున్న వాళ్లనే నిలబెడుతుందా, తాత్కాలిక సర్వే మాటల ప్రకారం ఈసారి కూడా గులాబీ జెండా క్యాండెట్ విషయంలో క్యాండెట్ పబ్లిసిటీని చూసా ఫోటోలు చూసో పొరపాటు చేస్తే మాత్రం ఈసారి పూర్తిగా పలు జిల్లాలలో గులాబీ జెండా కనుమరుగే అవకాశం ఉందంటూ కార్యకర్తల అంతర్గత ఆవేదన, పూర్తిగా ములుగు జిల్లా లో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో.
గిరిజన సంక్షేమ పథకాల కి భంగం కలగకుండా కాపాడుకునే నాయకుడు కావాలంటూ పలు గిరిజన సంఘాల మనోభావం. గత సర్వే పొరపాటుల వల్లే ములుగు జిల్లాలోని మంగపేట మండలం ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరిస్థితులు నెలకొన్నప్పటికీ. మారుమూల గిరిజన ప్రాంతాలలో గిరిజన బిడ్డలు ఎదుర్కొనే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి. గిరిజన ప్రజలను తన మాటలతో చైతన్యవంతం పరిచి, అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తున్న సీనియర్ నాయకుడు,
మాజీ సర్పంచ్, ఇప్పటిదాకా ప్రజల మన్నతి కోసం పాటుపడ్డవాడే కానీ, పదవుల కోసం ఆరాటపడని నాయకుడు కుడుముల లక్ష్మీనారాయణ,కి అన్ని రకాలుగా జిల్లా వ్యాప్తంగా రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కుడుముల లక్ష్మీనారాయణ విషయంలో అధిష్టానం కీలక నిర్ణయం పై ములుగు జిల్లా ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉందని కుడుముల లక్ష్మీనారాయణ యువసేన సూచన,
పార్టీ పరంగా ప్రజల మన్నతి పొందిన నాయకుల కంటే, ప్రజల మనిషిగా ప్రజల బాగోవులను గమనించి ప్రజలలో ఒకడిగా మనుగడ కొనసాగిస్తున్న నాయకుల పట్ల ప్రజలు మరింత విశ్వాసం చూపించే అవకాశాలు ఉన్నాయంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం, చేతి హస్తాన్ని సైతం ఉడుముల పట్టి వెనక్కి లాగే సత్తా కుడుములకే ఉందంటూ అంతేకాకుండా.
ఎమ్మెల్యే పోటీ బరిలో ప్రతిపక్ష పార్టీ నాయకుని చూసి పరిగెత్తే వాడు కాదు కుడుముల లక్ష్మీనారాయణ, ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల బంగారు భవిష్యత్తు కోసం గమ్యాన్ని చూసి ముందుకు నడిచే వాడే మా నాయకుడు గిరిజన ముద్దు బిడ్డ, గిరిజనేతరుల, శ్రేయోభిలాషి, మా కుడుముల లక్ష్మినారాయణే, అనీ ములుగు జిల్లాలోని యువత మరియు వృద్ధులు పలు ఓటర్లు కీలక సూచన..
Comments
Post a Comment