షాద్ నగర్ బీఆర్ఎస్ టికెట్ రేసులో "ఫైనల్"..

 *అంజనీపుత్రుడా.. వీరాధి వీరుడా..!* 

 *షాద్ నగర్ బీఆర్ఎస్ టికెట్ రేసులో "ఫైనల్"..* 

 *అంజయ్య యాదవ్ వైపే అధిష్టానం మొగ్గు..!* 

 *ఆనందంలో అంజయ్య అభిమానులు.. ఆందోళనలో ప్రతాప్ రెడ్డి అభిమానులు..?* 

 *వీడబోతున్న సస్పెన్స్..*

*అభిమానుల్లో ఉత్కంఠ* 


శేఖర్ గౌడ్ (సి. కే న్యూస్) షాద్ నగర్ :ఆగస్ట్ -18



రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ :అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అంటే చాలు.. అన్ని పార్టీల్లోనూ టికెట్ల రేస్ మొదలవుతుంది.. నువ్వా, నేనా అనే పోటీ కనిపిస్తుంది.. షాద్ నగర్ నియోజకవర్గం కూడా ఇందుకు అతీతం కాదు.. 

ఒకవైపు ప్రతిపక్షాలైన కాంగ్రెస్ లో ముగ్గురు, బిజెపిలో నలుగురు టికెట్ కోసం పోటా పోటీ పడుతుండగా, అధికార పార్టీలో కూడా ఇద్దరు రంగంలో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అంజయ్య యాదవ్ ఒకరు కాగా, మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి మరొకరు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య టిక్కెట్ విషయంలో సస్పెన్స్ నెలకొంది.

 ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అభివృద్ధి కార్యక్రమాలే తన ప్రోగ్రెస్ కార్డుగా ముందుకు సాగుతుండగా, ఈసారి టికెట్ తనకే వస్తుందని ప్రతాపరెడ్డి వర్గం ప్రచారం చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం రంగంలో ఉన్న ఈ ఇద్దరిలో పోటీలో ఎవరుంటే బాగుంటుంది.. అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


 *అంజన్న ఘనత..* 


ఉద్యమ కాలం నుంచి పార్టీలో పని చేస్తూ అసెంబ్లీ పరిధిలో ఉద్యమానికి ఊపు తెచ్చిన ఉద్యమ నేత వై. అంజయ్య యాదవ్. ఆయన పనితీరు నచ్చడం వల్లనే 2009 నుంచి వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్ అంజయ్య యాదవ్ ను ప్రోత్సహిస్తూ వచ్చారు.

 2009లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ 2014- 18లలో వరుస విజయాలతో దూసుకుపోయారు. మరోవైపు నియోజకవర్గంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చురుకుగా చేపట్టి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా నడుచుకుంటున్నారు. 

మరోవైపు కాంగ్రెస్ లో ఉన్న బలమైన లీడర్లను తన వైపుకు తిప్పుకొని పార్టీని నియోజకవర్గంలో అత్యంత పటిష్టంగా మలిచారు. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు చేసిన సర్వేల్లో కూడా అంజయ్య యాదవ్ విజయం సాధిస్తారని రిపోర్టు వచ్చింది. దీనితో అధిష్టానం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 

ముఖ్యంగా చెప్పుకోవాలంటే అంజయ్య సింపుల్ వ్యక్తిగా అందరికీ సుపరిచితం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఎన్నో సందర్భాల్లో ప్రజల ముందు మా అంజయ్య అమాయకుడు ఆయనను ఆశీర్వదించండి అంటూ చాలా సార్లు సంబోధించారు. అనవసరమైన ఆర్భాటాలు అట్టహాసాలు ఆయన చేయరు.

 ఆడంబరాలకు దూరంగా ఉంటారు. మొదట ఎలా ఉన్నారు ఇప్పటికి అలాగే ఉంటారు. ముఖ్యంగా గ్రామీణులతో పాదరసంలా కలిసిపోయే తత్వం. గ్రామాల్లో సాధారణ వ్యక్తులు కూడా అంజయ్యను చూసి దగ్గరగా పాల్గొనడం చేసుకుంటారు.

 ఎమ్మెల్యే హోదా ఇంకేదో పదవి అన్న భయం బెలుగు సాధారణ ప్రజల్లో కనిపించరు. అంజయ్య సొంత ఇంటి వ్యక్తిలా ఉంటారు. దాదాపు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఆయన అందరి ఆధార విమానాలు చూడగున్నారు ఏవైనా లోటుపాట్లు ఉన్న వాటిని సరిచేసుకున్నారు ప్రతి ఇంటికి ప్రతి గడపకు పరిసరమైన వ్యక్తిగా మునుపటికన్నా ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు.


 *ప్రతాప్ రెడ్డి గురించి..* 


మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి 2009లో ఇదే అంజయ్య యాదవ్ పై కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. 2014-18 ఎన్నికల్లో ఆయన చేతిలోనే ఓటమికి గురయ్యారు. తరువాత కాలంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో అడుగుపెట్టారు. మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తనకున్నాయని చెప్తున్న ప్రతాప్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

మరోవైపు ఆయన వర్గం ప్రతాప్ రెడ్డికి టికెట్ ఖాయమంటూ విస్తృతంగా ప్రచారం మొదలుపెట్టింది. అంజయ్య యాదవ్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుండగా, ప్రతాప్ రెడ్డి వర్గం నియోజక వర్గంలో హల్చల్ చేస్తుంది.

ప్రతాప్ రెడ్డికి కూడా సాధారణ వ్యక్తిగా పేరుంది. 


 *ఏది శ్రేయస్కరం..?* 


ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇస్తే శ్రేయస్కరం.. అన్న దానిపై కోన్ని సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మేల్యే అంజయ్య యాదవ్ గ్రామీణ స్థాయిలో బలం ,బలగం ఉన్న నాయకుడని, వేలకోట్ల రూపాయలు నిధుల రూపంలో తెచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉంటేనే బాగుంటుందని, ఆయనకు టికెట్ ఇస్తే హ్యాట్రిక్ కొడతారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

 ఇక ప్రతాప్ రెడ్డి విషయానికి వస్తే జనాలలో మంచి పేరు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు టికెట్ ఇస్తే గెలవడం కష్టమని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అంజయ్య యాదవ్ కు ఉన్న బలం, బలగం ఒకవేళ ప్రతాపరెడ్డికి టికెట్ ఇస్తే ఆయనకు అనుకూలంగా పనిచేయడం కష్టమనే చెబుతున్నారు. దీనితో గందరగోళ పరిస్థితులు ఏర్పడి  ఎన్నికల్లో ఆయన ఓటమికి దారితీస్తాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

ఎన్నికలు సాఫీగా సాగాలన్న, ఇక్కడి అసెంబ్లీ స్థానాన్ని టిఆర్ఎస్ స్వాధీనం చేసుకోవాలన్నా అంజయ్య యాదవ్ కు టికెట్ ఇవ్వడమే సరైన నిర్ణయం అని అధిక శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

వచ్చేసారికైనా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తన అనుచర గణాన్ని పెంచుకొని ఎక్కువగా పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. 

కేవలం ఎన్నికల సమయంలో తెరపైకి వస్తే పార్టీ క్యాడర్ అంత తొందరగా ఆయన వెంట నడిచే ఆస్కారం ఉంటుంద లేదా అన్నది సంశయం. అధిష్టానం చెప్పిన చెప్పకపోయినా కార్యకర్తకు అంటూ ఓ అభిప్రాయం ఉంటుంది..

Comments