మొబైల్స్ వద్దు... కుంగ్ ఫూ ముద్దు...

 మొబైల్స్ వద్దు... కుంగ్ ఫూ ముద్దు... 

న్యూ పవర్ కుంగ్ ఫూ అకాడమీ కోచ్ బల్రాజ్,అహ్మద్ ఖాన్ పిలుపు



మొబైల్స్ వద్దు, కుంగ్ ఫు ముద్దని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ్ బల్రాజ్,అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. షాద్ నగర్ లో న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు కరాటే, కుంగ్ ఫూ లాంటివి నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్ లేనిదే జీవితం లేదనేలా తయారు అయ్యారని, ముఖ్యంగా పిల్లలపై మొబైల్ ప్రభావితం ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. 

చిన్నప్పటి నుంచే మొబైల్ అలవాటుకు గురి కావడం వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగి, చదువులో వెనకబడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ అలవాట్లను మన్పించేలా విద్యార్థులకు వారి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని  వారిని శారీరకంగా, మానసికంగా దృడంగా తయారుచేయాలనే సంకల్పం ఉండాలని అన్నారు. నేటి సమాజం లో నిత్యం చిన్నపిల్లలపై, ఆడవారిపై జరిగే అకృత్యాలు సాహసం తో ఎదుర్కునెలా ఇప్పటి నుంచే కరాటే, కుంగ్ ఫు పోటీల్లో తర్పిదు చేయాలనీ కోరారు.

Comments