గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్.ఐల ఫై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : భూక్య రవి నాయక్

గిరిజన మహిళపై దాడి చేసిన ఎస్.ఐల ఫై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : భూక్య రవి నాయక్

*ఎల్బీనగర్ పిఎస్ లో విచారణ పేరుతో గిరిజన మహిళపై దాడి చేసిన పోలీసులు ఎస్.ఐల ఫై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలి- భూక్య రవి నాయక్ సేవాలాల్ సేన మహబూబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్*

19/08/2023

సికె న్యూస్ బయ్యారం మండల ప్రతినిధి జవాజి  ప్రవీణ్ కుమార్



వర్ధ లక్ష్మి అనే గిరిజన మహిళ భర్త చనిపోవడంతో తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ, ఇళ్లల్లో పని చేసుకుని బతుకుతున్నది. ఆగస్టు 14 న ఆమె తన కూతురు పెళ్లి ఖర్చుల కొరకు  దేవరకొండలో ఉండే  తన అన్న దగ్గరనుంచి 3,00,000 తీసుకొని, ఎల్బీనగర్ రింగ్ రోడ్డు దగ్గర ఆగస్టు 15న రాత్రి 11 గంటలకు బస్సు దిగింది. 

బస్టాండ్లో లక్ష్మితోపాటు ఇంకా కొంతమంది ట్రాన్స్ జెండర్ మహిళలు  కూడా ఉన్నారు. పోలీసులు అర్ధరాత్రి 11 గంటలకు వచ్చి  మీరెందుకు ఇక్కడ నిలబడ్డారు అని గట్టిగా అదిలించి, తిట్టుకుంటూ ట్రాన్స్ జెండర్ మహిళలతో పాటు లక్ష్మీని కూడా వ్యాన్ ఎక్కించుకొని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు  తీసుకొని వెళ్లారు.

కూతురి పెళ్ళి కార్డు చూపించినా నమ్మకుండా స్టేషన్ కు తీసుకెళ్ళి చావబాదారు. 

డబ్బులు బంగారం లాక్కొని లాఠీలతో దారుణంగా కొట్టారు. నిరుపేదలు అనగానే  పోలీసులకు ఎక్కడలేని కోపం అహంకారం వచ్చేస్తుంది. ప్రజలకు న్యాయం చేయడానికి ఫ్రెండ్లీ పోలీసింగ్... మహిళా రక్షణ కొరకు సఖి సెంటర్లు... అని చెప్పుకుంటూ  రోడ్డు మీద కనపడిన మహిళలను అక్రమంగా అడ్డుకుని నిర్బంధిచారు, లక్ష్మిని అత్యంత క్రూరంగా హింసించారు ఎన్నో కష్టాలు పడుతూ ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ బిడ్డ పెళ్ళికి కూడబెట్టుకున్న ఆమె రెక్కల కష్టం దోపిడీ దొంగల్లా గుంజుకున్నారు. 

48 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టుకుని మగ పోలీసులే ఆమెను కొట్టారని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ శరీర అంతర్భాగాలలో తీవ్రంగా గాయ పరిచారని బాధితురాలు చెబుతోంది. 

తనను ఎందుకు కొడుతున్నారు అని అడిగితే, నోరు మెదపకుండా  ఆమె నోట్లో బట్టలు కుక్కి కనీసం కారణం చెప్పకుండా రెండు రోజులు  స్టేషన్ లోనే ఉంచుకొని హింసించడం మానవ, మహిళా హక్కుల ఉల్లంఘన అవుతుంది ఎస్ ఐ, సి ఐ,  ప్రమేయం లేకుండా క్రింది స్థాయి పోలీసులు ఎందుకు కొడతారు 

 లక్ష్మి శరీరమంతా కందిపోయేటట్టు కొట్టిన ఇద్దరు పోలీసులను మాత్రమే సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నది ఆమె వొళ్ళంత కుళ్ళ బొడిచిన పోలీసులపై అధికారులపై, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్  పెట్టి అరెస్ట్ చేయాలి.

పోలీస్ స్టేషన్లో రెండు రాత్రులు ఆడవాళ్లను పెట్టుకోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం నేరం. 

ఈ నేరానికి పాల్పడిన సంబంధిత పోలీసులపై  చర్యలు తీసుకోవాలని, లక్ష్మి డబ్బులు మూడు లక్షలు, మూడు తులాల బంగారు గొలుసు అర తులం  కమ్మలు  వెంటనే ఆమెకు ఇచ్చేయాలని సేవాలాల్ సేన బయ్యారం మండల కమిటీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.

Comments