రైతులను గోస పెట్టీన సీఎం చిత్రపటానీకి పాలాభిషేకo

 రైతులను గోస పెట్టీన.  

 సీఎం చిత్రపటానీకి పాలాభిషేకo

 మెదక్ జిల్లా చేగుంట మండల్ సి కే న్యూస్  ప్రతినిధి  కొండి శ్రీనివాస్ ఆగష్టు 05 



దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 9. సంవత్సరాలు గడిచినప్పటికీ రైతులకు తొమ్మిది సంవత్సరాల కాలంలో రైతులకు రుణమాఫీ గుర్తుకు రానిది ఎలక్షన్ ముందు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని చెప్పారు ఇప్పటికీ కూడ నాలుగున్నరేళ్లు  ఋణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు.                                                  

* రైతులు కట్టిన వడ్డీలు ప్రభుత్వం కట్టాలి. 

* ఎన్నికలు ఉన్నాయనే  రుణమాఫీ డ్రామా 

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి  నాలుగున్నరేళ్లుగా రైతులను అరిగొస పెట్టీ నేడు ఎన్నికలు ఉన్నాయని రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చేప్పగానే ముఖ్యమంత్రి కి పాలాభిషేకాలు చేయడం సిగ్గు చేటని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగున్నరెళ్లుగా లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేయకపోవడం వల్ల రైతులు వడ్డీ కట్టలేక అప్పులు చేయాల్సి వచ్చిందని, బ్యాంకు అధికారులు  పంట రుణం కట్టాలని రైతులపై ఒత్తిడి చేయడంతో వారు బ్యాంకులకు వెళ్ళడమే మానేశారని, బిఆఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఋణమాఫీ రైతులు కట్టే వడ్డీలకు సరిపోదని ఎద్దేవా చేశారు. 

పంట రుణాలు మాఫీ చేయకుండా  రైతులను  ఇబ్బందులకు గురిచేయడం కాకుండా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన  ప్రకటనలకే పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతకాలం కాలయాపన చేసిన ముఖ్యమంత్రి కి నేడు రైతులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే రైతులకు రుణమాఫీ ప్రకటన చేసి, రైతుల పట్ల కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. 

కేసీఆర్  మోసపూరిత వాగ్దానాలు చేసినా రైతులు నమ్మే స్థితిలో లేరని, తెలంగాణ రైతులు కాంగ్రెస్ పక్షాన నిలుస్తారని, రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాదన్న సంకేతాలు రావడంతోనే   కేసీఅర్ రైతులను మచ్చిక చేసుకోవడం కోసం రుణమాఫీ డ్రామా చేస్తున్నాడని, రైతుల ఆగ్రహం ముందు కేసీఆర్ డ్రామాలు సాగవని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, రైతులకు రెండు లక్షల ఋణమాఫీ ఏకకాలంలో చేస్తుందన్నారు.

Comments