అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ 14వ రోజుకు చేరిన సమ్మె

 *అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ

14వ రోజుకు చేరిన సమ్మె

అంగనవాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడి ఉద్యోగులకు గ్రాట్యుటీ చేయించాలి.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు పది లక్షలు,హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలి.వేతనంలో సగం పెన్షన్ నిర్ణయించాలి.

3 సంవత్సరాల రేషన్ షాప్ ట్రాన్స్ పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలి. 

*సిఐటియు జిల్లా అధ్యక్షురాలు జిలకరి  పద్మ * ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్  భూక్యా లలిత


సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావత్ హాథిరాం నాయక్



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు -సిఐటియు ఏఐటీయూసీ  సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 11 తారీఖు నుండి నిర్వహిస్తున్నటువంటి నిర్వాదిక సమ్మెలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో మౌన హారం చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షురాలు జిలకరి పద్మ  ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా లలిత మాట్లాడుతూ అంగనవాడి టీచర్స్ మరియు హెల్పర్స్ ను ప్రభుత్వాలు తమ అవసరాలరీత్యా అన్ని విభాగాల్లో వాడుకుంటున్నారని అన్నారు. 

చిన్నపిల్లలకు చదువు చెప్పటం కానుండి అన్ని రకాలుగా ఓట్లు తొలగించడం వంటివి వారితో చేస్తున్నారని అన్నారు. కానీ వారికి కనీసం 26,000 కూడా జీతం ఇవ్వట్లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70000 మంది అంగన్వాడి ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు వీరంతా మహిళా బడుగు బలహీన వర్గాలకు వారికి చెందిన వారిని అన్నారు. 

గత 48 సంవత్సరాలుగా ఐసిడిఎస్ లో పనిచేస్తూ పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. అయినా వీరికి కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత చట్టబద్ధ సౌకర్యాలు ఏవి రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కల్పించలేదని అన్నారు.

 దీనివల్ల అంగనవాడి ఉద్యోగులు చాలా నష్టపోతున్నారని అన్నారు. మన పక్కనే ఉన్న తమిళనాడు పాండిచ్చేరి రాష్ట్రాల్లో అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని అన్నారు. 

తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడి ఉద్యోగులకు హెల్త్ కార్డు ఇచ్చారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లిస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు అంగన్వాడి ఉద్యోగులకు కల్పించడం లేదని అన్నారు. 

స్వయంగా ముఖ్యమంత్రి గారే అంగన్వాడీ వర్కర్ పేరును టీచర్గా మార్చారని అన్నారు. కానీ టీచర్లతో సమానంగా వేతనాలు ఇతర సౌకర్యాలు మాత్రం ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. 

ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ, గ్రామపంచాయతీ సెక్రటరీలను, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిందని అన్నారు. వీరిలాగే అంగన్వాడీలను  కూడా పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని అన్నారు. 

అంగన్వాడి ఉద్యోగులకు ఆసరా కళ్యాణ్ లక్ష్మీ చరిత్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని అన్నారు. లేనిపక్షంలో వామపక్ష అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్లు, ప్రగతి భవన్ ముట్టలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సీత మహాలక్ష్మి, , విజయలక్ష్మి, భారతి, పుల్లమ్మ లక్ష్మి సీతా లక్ష్మి, సుజాత ఆదిలక్ష్మి, స్రవంతి మహాలక్ష్మి ఏసు మని చంద్రకళ పార్వతి సుభద్ర సక్కు లీల తదితరులు పాల్గొన్నారు.

Comments