*ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు కొనసాగిస్తాం*
సి కె న్యూస్ ప్రతినిధి / పెంట్లవెల్లి :
*సిపిఎం జిల్లా నాయకులు డి ఈశ్వర్*
పెంట్లవెల్లి మండల కేంద్రంలో స్థానిక గ్రంధాలయం దగ్గర సిపిఎం పార్టీ పెంట్లవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 38వవర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు డి ఈశ్వర్ ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది
అనంతరం ఆయన మాట్లాడుతూ వీరతెలంగాణ సాయుధ రైతంగా పోరాటంలో ఐలమ్మ పాత్ర గణనీయమైందని అన్నారు భూమికోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం అప్పుడున్నటువంటి ఆంధ్ర మహాసభ పేరుతో దొరల దౌర్జన్యలను ఆకృత్యాలను ఎదిరించిన మట్టి మనుషుల చరిత్రని అన్నారు
విష్ణుర్ రామచంద్ర రెడ్డికి వ్యతిరేకంగా గడిలను బద్దలు కొట్టి గడిల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దీరవనిత అని అన్నారు ఆ స్ఫూర్తితో 10 లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగిందని అన్నారు.
బాంచన్ కాల్ మొక్కత అన్నవారే చేత బంధుకులు చేత పట్టించి పోరాటం నడిపినట్టువంటి చరిత్ర అని అన్నారు. చాకలి ఐలమ్మ సాగుచేసిన భూమిలో ధాన్యాన్ని ఎత్తుక పోవడానికి దొరలు వస్తే ఎర్రజెండా అండతో వారిని తరిమి తరిమి కొట్టినట్టువంటి చరిత్ర ఐలమ్మదని అన్నారు
నిజాం నవాబుకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి చరిత్రను మట్టి మనుషుల చరిత్రను నేడు బిజెపి వక్ర భాష్యాలు చెబుతూ హిందూ ముస్లిం కొట్లాటగా ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్రగా చరిత్రను చెరిపేసే విధంగా ప్రయత్నం చేస్తుందని అన్నారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు హనుమంతు ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు తరుణ్ ఆర్ రాము పల్లె రామకృష్ణ డి రాజు శ్రీనివాసులు చిట్టెమ్మ చిన్నమ్మ మంజు శివ సందీప్ శివ , పరమేష్ కురుమయ్య ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment